నెహృ-గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడు కావచ్చుకానీ, పార్టీపై మాత్రం ఆ కుటుంబం పట్టుకోల్పోకుండా ఉండాలని ఆ పార్టీ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ అన్నారు. కాంగ్రెస్ తదపరి అధ్యక్షునిగా రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ ను నియమిస్తారంటూ, వస్తున్న వ్యాఖ్యలపై  ఆయన స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధి ఉంటే మంచిదే గానీ, ఆయన అభిప్రాయాలను సైతం గౌరవించాల్సిన అవసరం నేడు కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు ఉందని సూచించారు. గాంధీ, నెహ్రూ కుటుంబాలు అధ్యక్ష పదవిలో లేకున్నా పార్టీ ప్రజల్లో బలంగా ఉంటుందన్నారు.

పార్టీలో క్లిష్ట పరిస్థితులు తలెత్తినపుడు, నాయకుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తితే మాత్రం వాటిని పరిష్కరించే సత్తా మాత్రం గాంధీ కుటుంబానికే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహులే కొనసాగుతారా? లేక అశోక్‌కు అప్పగిస్తారా? అన్న దానికి వేచి చూడాల్సిందేనని మణిశంకర్ అయ్యర్ బదులిచ్చారు. మొదట గాంధీ ముక్త్ కాంగ్రెస్ కావాలని బీజేపీ ప్రయత్నించిందని, తద్వారా కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటోదని విమర్శించారు.
Image result for ashok gehlot maniSankar
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యతవహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తల్లి సోనియా గాంధితోపాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు, శ్రేయాభిలాషులు ఎంతగా నచ్చజెప్పినా ఆయన మాత్రం తన నిర్ణయం మార్చుకోనని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగించనున్నారనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కొత్త సారథి కోసం కమిటీ ఏర్పాటైంది. 



సోనియా గాంధీ, అహ్మద్‌ పటేల్, గులాం నబి ఆజాద్, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్‌‌ల బృందం కొత్త అధ్యక్షుడి కోసం అన్వేషణ సాగిస్తోంది. రాహుల్ గాంధీ స్థానంలో కొత్త అధ్యక్షుడిగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ పేరు దాదాపు ఖరారైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అశోక్ గెహ్లాత్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. 
Image result for rahul gandhi ashok gehlot
సుదీర్ఘ రాజకీయ అనుభవం, కాంగ్రెస్‌ తో మంచి అనుబంధం ఉన్న అశోక్ గెహ్లాత్, అధ్యక్ష పదవికి సరైన వ్యక్తి అని ఈ కమిటీ భావించినట్టు సమాచారం. ఇదే సమయంలో కాంగ్రెస్‌లో కుటుంబ పాలన నడుస్తోందని బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని కూడా దీని ద్వారా తిప్పకొట్టవచ్చునని ఆలోచిస్తున్నట్లు అభిఙ్జవర్గాల సమాచారం. అశోక్ గెహ్లాత్‌కు అధ్యక్ష పదవి ఖాయమైందంటూ నవభారత్‌ టైమ్స్‌ ఆదివారం ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇదిలావుండగా, 68 ఏళ్ల అశోక్ గెహ్లాత్ గతంలో రెండు సార్లు రాజస్థాన్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడాయని మూడోసారి అదే విధుల్లో ఉన్నారు. 



గత సంవత్సరం రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం తో సచిన్ పైలట్‌ ను సీఎంగా అనుకున్నా, సీనియారిటీకి ప్రాధాన్యమిచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం అశోక్ గెహ్లాత్ వైపు మొగ్గు చూపింది. తాజాగా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆయనకు కట్ట బెట్టి, సీఎం పదవిని సచిన్‌ పైలట్‌‌ కు ఇవ్వాలని సోనియా భావిస్తున్నట్టు సమాచారం. అయితే, పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ముఖ్య మంత్రులుగా కొనసాగుతున్నవారు కూడా ఉన్నారని ఆయన మద్దతు దారులు వాదిస్తున్నారు. 

Image result for rahul gandhi ashok gehlot

పశ్చిమ్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, గతంలో అఖిలేశ్, మాయావతి, దివంగత తమిళనాడు సీఎం జయలలిత‌, తెలంగాణా సీఎం కేసీఆర్, ఏపి మాజీ సీఎం చంద్రబాబు నాయుడులను ఉదాహరణగా చూపుతున్నారు. వీరంతా తమ పార్టీలకు అధినేతగా ఉంటూ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారని అంటున్నారు. అయితే  లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 52స్థానాలతోనే సరిపెట్టుకుంది. గత ఎన్నికల కంటే ఇవి కేవలం 8సీట్లు మాత్రమే అధికం. బీజేపీ సారథ్యం లోని ఎన్డీయే 352 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. బీజేపీ ఒంటరిగానే 303స్థానాలు సాధించి, 2014ఎన్నికల కంటే 30సీట్లు అధికంగా సొంతం చేసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: