అవును విచిత్రంగా ఉన్న ఇదే నిజం. ఈమధ్యనే టిడిపి నుండి బిజెపిలోకి జంప్ చేసిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో తెలుగుదశంపార్టీ మళ్ళీ అభివృద్ధిలోకి రావాలని కోరుకునే వాళ్ళలో తాను ముందుంటానంటూ ప్రకటించారు. ఈ ఒక్క ప్రకటన చాలు సుజనా ఎప్పటికీ చంద్రబాబునాయుడు మనిషే అని చెప్పటానికి.

 

నిజానికి చంద్రబాబుకు బినామీలుగా సుజనా, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావులపై ఎప్పటి నుండి ప్రచారం ఉంది. వారు ఆరునూరైన చంద్రబాబును వదిలి పెట్టే ఛాన్సే లేదు ఎప్పటికి. అలాంటిది ఒక్కసారిగా ముగ్గురూ టిజి వెంకటేష్ తో కలిసి బిజెపిలోకి ఫిరాయించారంటే నిజంగానే చంద్రబాబును వదిలిపెట్టేసి ఫిరాయించారని నమ్మేంత పిచ్చోళ్ళెవరూ లేరు.

 

వాళ్ళు బిజెపిలోకి వెళ్ళటానికి ఒకటే కామన్ పాయింట్. తమ ఐదేళ్ళల్లో జరిగిన అవినీతిపై జగన్మోహన్ రెడ్డి ఎక్కడ విచారించి కేసులు పెడతారో అన్న భయం మొదటిది. ఇక తమ అవినీతిపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతున్న కేసుల్లో కేంద్రప్రభుత్వ దర్యాప్తు సంస్ధలు ఎక్కడ తమను అరెస్టు చేస్తాయో అన్న భయం రెండో కారణం.

 

మొదటి భయమేమో చంద్రబాబుతో పాటు పుత్రరత్నం నారా లోకేష్ కు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని స్వయంగా బిజెపి నేతలే ఎన్నోసార్లు ఆరోపించారు. తాజగా జగన్ కుడా విచారణకు ఆదేశించారు. కాబట్టి అవినీతి మొత్తం బట్టబయలు కాక తప్పదు. తర్వాత కేసులు, అరెస్టులు ఎటూ ఉంటాయి.

 

ఇవన్నీ ఊహించే అటువంటి సమస్యలు ఎదురుకాకుండా రక్షణ కోసమే తన మనుషులను బిజెపిలోకి పంపారు చంద్రబాబు. ఆ విషయమే సుజనా తాజా ప్రకటనతో బయటపడింది.  బిజెపి ఏమో చంద్రబాబు అంతు చూద్దామని పంతం పడుతుంటే సుజనా ఏమో టిడిపి మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకోవటమే వాళ్ళకి మింగుడుపడటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: