- రూ.2 కోట్లు లంచం తీసుకుంటుండగా పట్టబడ్డ కోపరేటివ్‌ రిజిష్ట్రార్‌
అవినీతిని సహించని ఒక పక్క నూతన ముఖ్యమంత్రి ఘంటాపధంగా చెబుతున్నా ... మరోపక్క అవినీతి తిమింగలాలు తమ పనిని యధాలాపంగా సాగించేస్తున్నారు. ఈ కోవలోనే మంగళవారం ఓ అధికారి ఏసీబీ వలకు చిక్కారు. రూ. 2 కోట్లు విలువ చేసే భూమి రిజిష్ట్రార్‌ చేయించుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.  వివరాల్లోకెళ్తే....


రాజమహేంద్రవరం సహకార శాఖ రిజిస్ట్రార్‌ మల్లికార్జునరావు వద్దకు వచ్చిన ఓ లబ్ధిదారుని రూ.2 కోట్లు డిమాండ్‌ చేశాడు. ఆయన  న‌గ‌దుకు బ‌దులు భూమి రిజిస్ట్రేష‌న్ చేయించుకుంటుండ‌గా acb అధికారులు చాకచక్యంగా మల్లిఖార్జున రావు ని ప‌ట్టుకున్నారు. 


 లంచం ఇవ్వడం ఇష్టం లేని  బాధితుడి  ఏసీబీ అధికారులను ఆశ్రయించడం తో  విశాఖ టర్నర్ ఛౌల్ట్రీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ భూ రిజిస్ట్రేషన్ సమయంలో  వలపన్ని పట్టుకున్నారు ఈ సంధర్బంగా కేసు వివరాలను acb dsp రంగరాజు మీడియాకి తేలీపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: