ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మతః కోటీశ్వరుడు అన్న విషయం తెలిసిందే. జగన్  తండ్రి,  తాత  అంతా సంపన్నులే.  జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా కూడా పనిచేశారు.

 

ఇక వైయస్ కుటుంబానికి పులివెందుల లో చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి.  స్థిరాస్తులు కాకుండా  వైయస్ జగన్ కు అనేక వ్యాపారాలు ఉన్నాయి.  రాజకీయాల్లోకి రాక ముందే ఆయన ఎన్నో వ్యాపారాలు నిర్వహించే వారు.  పవర్ ప్రాజెక్టులు, మీడియా  రంగాల్లో  ఆయన పెట్టుబడులు పెట్టారు.

 

మరి ఇంతకీ జగన్ ఆస్తిపాస్తుల విలువ ఎంత..  అనధికార లెక్కల పక్కనపెడితే..  అధికారికంగా జగన్ ఆస్తుల విలువ ఎంత..  ఈ విషయాలను అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్  సంస్థ మీడియాకు వివరించింది.  ఈ లెక్కల ప్రకారం అక్షరాల 510 కోట్ల రూపాయలు.

 

వైయస్ జగన్ క్యాబినెట్లో 26 మంది మంత్రులు ఉండగా అందరిలోనూ జగన్మోహన్ రెడ్డి  అగ్రస్థానంలో ఉన్నారు.  జగన్ ఇటీవల ఎన్నికల్లో  సమర్పించిన ప్రమాణపత్రం ఆధారంగా  ఈ వివరాలు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: