ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారాలంటే ఆ పార్టీ సిద్దాంతాలు, సేవాభావం సరిపోలాలి లేదా సమీప సారూప్యత ఉండాలి.  ప్రస్తుత రాజకీయ నాయకులకు వీటితో ఏమీ పనిలేదన్నట్టుగా ఉన్నారని  రాజకీయ విశ్లేషకులు ఆవేదన చెందుతున్నారు. అధికారమే పరమావధిగా కొందరు సినీ గ్లామర్‌తో కొత్త పార్టీలను ప్రతిష్టించటం పరిపాటిగా మారిపోయింది. 


తమకు ప్రజలలో ఏ విధమైన విలువ ఉంది, అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే ప్రాధమిక కొలమానం కూడా లేకుండా రాజకీయ అరంగేట్రం చేసేస్తున్నారు. పోలింగ్‌లో పరాజయం పొందిన అనంతరం తమకు ప్రజలలో ఏ మాత్రం పలుకుబడి ఉందో తెలుసుకుని మొఖం చాటేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు అనంతరం ఆ స్థాయినిగాని , ఆ సంకల్పాన్నిగాని అందుకోగలిగే నాయకులు ఇప్పటి వరకూ ఎవరూ తయారుకాలేదు. 


2009 ఎన్నికల నుంచి రాజకీయ నాయకుడిగా రంగప్రవేశం చేసిన ప్రముఖ సినీనటుడు చిరంజీవి (కొణిదల శివ శంకర వరప్రసాద్‌) 2008 లో ప్రజారాజ్యం పార్టీ (పిఆర్‌పి)ని స్థాపించారు.  294 అసెంబ్లీ స్థానాలతో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 288 స్థానల్లో పోటీచేసి చివరికి 18 స్థానాల్లో విజయం సాధించింది. తన సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారనే నిందకూడా వేసుకున్నారు. 


తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో 2011 లో పీఆర్‌పీ అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేయబడింది. టూరిజం మంత్రిగా ఒక వెలుగు వెలిగిన చిరంజీవి 2014, 2019 ఎన్నికల్లో తెరమరుగయ్యారు. ఇప్పడు తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ విధానాలుగాని, సిద్దాంతాలతోగాని తమకు పనిలేదని చిరంజీవి మరోసారి పార్టీ మార్పతో చెప్పదలచుకున్నారా ... అనే ప్రశ్నలు అభిమానుల్లో ఉదయిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: