సోషల్ మీడియాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే వాల్యు ఏంటో మరోసారి అందరికీ తెలిసింది.  తొందరలో  పేదలకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. అందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

 

ఇందులో భాగంగానే ప్రభుత్వం బియ్యం సరఫరాకు సంచులను కూడా ఎంపిక చేసింది. ప్రభుత్వం ఎంపిక చేసిన సంచులను చూడగానే ముందుగా అందరికీ  తెలుగుదేశంపార్టీనే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఎంపికైన సంచులన్నీ పసుపు రంగులోనే ఉన్నాయి. వాటిపై జగన్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ బొమ్మలున్నా పసుపు రంగే కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

 

ఎప్పుడైతే సంచుల రంగు బయటకు వచ్చిందో వెంటనే వైసిపి సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిపోయింది. నెటిజన్లు ప్రభుత్వాన్ని తప్పుపట్టటం మొదలుపెట్టారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా పసుపు రంగు సంచులేంటంటూ మండిపడ్డారు. సంచులను ఎంపిక చేసిన వాళ్ళను డిజైన్ చేసిన వాళ్ళపై సెటైర్లు కూడా మొదలయ్యాయి.

 

మొత్తానికి నెటిజన్ల బాధ జగన్ దృష్టికి చేరింది. వెంటనే దీనిపై ఓ సమీక్ష జరిగింది. అంతే వెంటనే సంచుల రంగు ఒక్కసారిగా మారిపోయింది. వైసిపి జెండాలోని రంగులే సంచుల రంగులుగా మారిపోయింది. దాంతో నెటిజన్లు ఫుల్లు ఖుషీ అయిపోయారు. మొత్తానికి ఇక్కడ గమనించాల్సిన విషయం  ఏమిటంటే సోషల్ మీడియాకు జగన్ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: