కృష్ణాతీరంలో చంద్రబాబు నివాసం ఉంటున్న  లింగమనేని ఇంటిపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.  ఆ ఇంటికి  అన్ని అనుమతులు ఉన్నాయని మంత్రి లోకేష్ తో సహా టిడిపి నేతలు వాదిస్తున్నారు.  వైయస్ హయాంలో అనుమతులు వస్తే  జగన్ ఎలా కాదంటారని ప్రశ్నిస్తున్నారు.

టిడిపి నేతల వాదనలకు మంత్రి  బొత్స సత్యనారాయణ  సమాధానం ఇచ్చారు.  ఆయన ఏమన్నారంటే....

"బాబు సొంత ఇల్లు కాదు అది... అన్యాక్రాంతంగా , అక్రమ కట్టడమది. లింగమనేని రమేష్ భూమిలో శాశ్వత నిర్మాణాలు చేయకూడదు అని నిబంధన ఉంది.. న్యాయస్థానాలు ఏమీ చెప్పయో తెలుసు కదా...అక్రమ కట్టడం కాదని చెప్పమనండి...

 

ఈ ప్రభుత్వానికి ఎవ్వరూ మీద వ్యక్తిగత కక్షలు లేవు..అవినీతిని తావు లేని పాలన అందిస్తాం..చంద్రబాబు నివాసానికి మాత్రమే కాదు అందరికీ నోటీసుకు ఇస్తాం..చేసిన తప్పు తెలుసుకుని ప్రభుత్వానికి సహకారం అందించడం నేర్చుకోండి..

 

విద్యుత్ ఒప్పందాల్లో 2600 కోట్లు ప్రభుత్వం నష్టపోయింది దాని మీదే విచారణ చేయిస్తాం..లోకేశ్ నాన్న గారిని అడిగితే ఎలా అవినీతి జరిగింది తెలుస్తుంది. అన్నీ మీ ఇంటికే వచ్చాయి కాదా. దాంబికలు ఎందుకు మాట్లాడడం.... సీ ఆర్ డి ఏ పరిధిలో లేదు అని చెప్పడానికి యనమల ఎవరూ?
ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది... ఎవ్వరైనా వదలదు.."

మరింత సమాచారం తెలుసుకోండి: