పదవులు పట్టాలంటే పెట్టి పుట్టాలంటారు. కొందరికి పదవులు ఇంట్లోనే ఉంటాయి. మరి కొందరికి పదవులు ఎంత కష్టపడ్డా దక్కవు. మరి కొందరికి ఇదిగో తీసుకో అంటూ వూరిస్తూంటాయి. ఏదైనా నుదిటి రాత ఎలా ఉంటే అలాగే  జరుగుతుంది. దేశంలో చూసినా ఏపీ రాజకీయాలు చూసినా ఇదే విషయం అర్ధమవుతుంది.


ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పమంటే  సినిమాల్లో హిట్, రాజకీయాల్లో ఫట్ అంటారు. అయితే ఆయన సరిగ్గా రాజకీయం చేసి ఉంటే  అక్కడ కూడా హిట్ అయ్యేవారన్న ఆలోచన కూడా చాలా మందిలో ఉంది. ఎందుకంటే చిరంజీవి ఉమ్మడి ఏపీలో గట్టి పోటీ మధ్య కూడా 70 లక్షల ఓట్లు, 18 ఎమ్మెల్యేల సీట్లు సంపాదించడం అంటే ఆషామాషీ కాదని అంతా అంటారు. 


ఇదే ఇపుడు చాలా పార్టీలను టెంప్ట్ చేస్తోంది. చిరంజీవిని కనుక లాక్కుంటే ఏపీలో ఎదురులేదు, సరైన గైడెన్స్ ఇచ్చి ఆయన్ని ప్రోజెక్ట్ చేస్తే గెలుపు బాటన పయనించవచ్చు అని బీజేపీ భావిస్తోందట. ఈ మేరకు చిరంజీవికి ప్రపోజల్స్ వెళ్ళాయి. బీజేపీలో చేరితే రాజ్యసభ సీటు, కేంద్ర మంత్రి పదవి ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటిస్తోంది బీజేపీ. కాలిదాక వచ్చిన ఆఫర్ ని తన్నుకుంటే ఎలా అని చిరంజీవి సీరియస్ గా ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు.


చిరంజీవి ప్రస్తుతం సైరా షూటింగ్ చివర్లో ఉన్నారు. దాన్ని పూర్తి చేస్తుకున్న తరువాత ఆయన రాజకీయ ప్రవేశంపై ద్రుష్టి పెడతారని అంటున్నారు. చిరంజీవి కనుకో ఓకే అంటే మాత్రం ఏపీలో బీజేపీ పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో కాపు ఓట్లే కాదు, మెగాభిమానులు కూడా ఆయన పక్కన చేరుతారు. 


ఇది ముఖ్యంగా పవర్ కళ్యాణ్ కి దెబ్బతీస్తుందని అంటున్నారు. పవన్ సైతం మెగాభిమానులు, కాపుల ఓట్ల మీద బేస్ అయి పాలిటిక్స్ చేస్తున్నారు. అన్నదమ్ములు చేరో పార్టీలో ఉంటే చిరంజీవి వైపే మొగ్గు ఉంటుందని అంటున్నారు. చిరంజీవి కనుక ఒకే అంటే మాత్రం జనసేనకు, తమ్ముడికీ గట్టి ఝలక్ తప్పదని అంటున్నారు. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: