వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు పెరిగాయి అని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.  ముఖ్యమంత్రి అండ చూసుకుని వైసిపి నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని  మండిపడుతున్నారు.  ఇప్పటికే ఏడుగురు తెలుగుదేశం కార్యకర్తలను  వైసిపి వాళ్లు చంపేశారని చెబుతున్నారు.

 

ఓవైపు తెలుగుదేశం నేతల విమర్శలు ఇలా ఉంటే...  ఇటీవల వెలుగుచూసిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆడియో టేప్ ఉదంతం ఆ పార్టీని మరింత ఇరుకున పెడుతోంది.  ఓ జర్నలిస్టును బెదిరిస్తూ..  మీ అంతు చూస్తా నడిరోడ్డుపై నరికేస్తా..  అంటూ మాట్లాడిన ఆడియో ని తెలుగుదేశం అస్త్రంగా మలుచుకుంది.

 

టీడీపీ  నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.... వైసీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు.వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ లో ఒక వ్యక్తిని దూషించిన ఆడియో టేప్ ను మీడియా కి చూపించారు.

 

ఆయన ఇంకా ఏమన్నారంటే...

" సీఎం వెంటనే వైసీపీ కార్యకర్తలను కంట్రోల్ చేయాలి.ఇప్పటికి 7గురు టీడీపీ కార్యకర్తలు హతమయ్యారు.హోమ్ మంత్రి ముందు ఆమె భాద్యతలు ఏంటో తెలుసుకోవాలి. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి. బీహార్ లాగా ఏపీని మార్చాలని సీఎం అనుకుంటున్నారా? ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ని వెంటనే అరెస్ట్ చేయాలి... అంటూ డిమాండ్ చేశారు.  ఈ కోటంరెడ్డి ఆడియో జగన్ కు తలనొప్పిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: