తెలుగుదేశం పార్టీ నుంచి ఒకొక్కరు చేజారడం వెనుక ఎవరి కారణం వారికి ఉందన్న వాదనలు విన్పిస్తున్నాయి . రాజకీయాల్లో కొనసాగుతూ , వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులు , ఇతరత్రా వ్యాపారాలు చేస్తున్న నాయకులు , తమకు అధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేకనే టీడీపీ ని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది  . ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు, టీడీపీ లో  చాలామందే నేతలే  ఉన్నట్లు తెలుస్తోంది . 


 అనంతపురం  జిల్లా  ధర్మవరం మాజీ  ఎమ్మెల్యే వరదాపురం సూరి కూడా వారిలో ఒకరని టీడీపీ వర్గాలు అంటున్నాయి .  సూరి బీజేపీ లో  చేరాలనుకోవడం వెనుక అసలు కథ వేరే ఉందని తమ్ముళ్లు చెబుతున్నారు . తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయం లో అనంతరపురం జిల్లాలో  చేపట్టిన రోడ్డు కాంట్రాక్టు పనుల్లో  వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వారిలో వరదాపురం సూరి తొలి రెండు స్థానాల్లో ఉంటారని అంటున్నారు  . ప్రస్తుతం సూరి చేపట్టిన  రోడ్డు కాంట్రాక్టు పనులన్నీ నిర్మాణ దశలోనే ఉండడం తో , అయన సేఫ్ సేడ్ కోసం, టీడీపీ వీడి  బీజేపీ లో చేరడం బెటరని భావిస్తున్నారని చెబుతున్నారు . 


రోడ్డు నిర్మాణ పనుల్లో అక్రమాలను వైకాపా ప్రభుత్వం ఎక్కడ తవ్వి తీస్తుతుందోనని భావిస్తోన్న   వరదాపురం సూరి , తన అక్రమ భాగోతాలను కప్పి పుచ్చుకోవడాని  బీజేపీ లో చేరాలని భావిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది  . అనంతపురం జిల్లాలో కొండలను పిండి చేసి వరదాపురం సూరి   ప్రకృతి విధ్వంసానికి పాలపడుతున్నారని   స్థానికులు ఇప్పటికే అయన పై అనేక ఫిర్యాదులు చేసినట్లు సమాచారం . స్థానికుల ఫిర్యాదుల ఆధారంగా  వైకాపా ప్రభుత్వం విచారణ చేపట్టే అవకాశం ఉందని భావిస్తోన్న సూరి , బీజేపీ లో చేరడం ద్వారా వైకాపా ప్రభుత్వం నుంచి రక్షణ పొందవచ్చునని భావిస్తున్నట్లు సమాచారం . 


మరింత సమాచారం తెలుసుకోండి: