ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఇలాకాలో ఆ పార్టీ ఇర‌కాటంలో ప‌డే ప‌రిస్థితి ఎదురైంది. గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలోని సాధు బెట్ అనే చిన్న దీవిలో భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇంటిగ్రేషన్ ట్రస్ట్’ ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టును చేపట్టింది. ఈ విగ్రహ నిర్మాణ వ్యయం రూ. 3,000 కోట్లు. గ‌త ఏడాది అక్టోబర్ 31న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఇది. దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ అని పిలుస్తున్నారు. అయితే, ఈ విగ్ర‌హం గ్యాలరీ సీలింగ్‌లో పగుళ్లు ఏర్పడ్డాయి. ఆ సీలింగ్‌ నుంచి వర్షపు నీరు కారుతోంది. 


ప్రపంచంలోనే ఎత్తైన 182 మీటర్ల ఈ విగ్రహాన్ని గతేడాది అక్టోబర్‌లో ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌కు అంకితం చేసిన విషయం తెలిసిందే. తొలిసారి వర్షకాలాన్ని ఎదుర్కొంటున్న ఈ విగ్రహంలోని గ్యాలరీ సీలింగ్‌ సందర్శకులను వర్షపు నీటి నుంచి రక్షించలేకపోతోంది. ఆ గ్యాలరీ ఫ్లోర్‌ మొత్తం సీలింగ్‌ నుంచి కారుతున్న నీటితో నిండిపోయింది. దీంతో సీలింగ్‌ నుంచి పడుతున్న నీటి దారలను, అలాగే ఫ్లోర్‌పై నిలిచిన నీటిని వీడియోలు తీసుకుంటున్నారు. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.


ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌, భారీ విగ్ర‌హంలో భాగంగా... 2014లో ఎల్&టీ సంస్థకు ఇంజినీరింగ్, సేకరణ, నిర్మాణ(ఈపీసీ) బాధ్యతలు అప్పగించారు. ఈపీసీ కాంట్రాక్టులో ఒకే సంస్థ డిజైనింగ్‌తో పాటు
మిగతా అన్ని బాధ్యతలూ చూసుకోవాలి. ఎల్&టీ విగ్రహ డిజైనింగ్‌ను తన సొంత సిబ్బందితో పాటు బెగేట్ అనే సంస్థ సాయంతో పూర్తి చేసింది. మొత్తం నిర్మాణ రూపకల్పనను అరూప్ ఇండియా అనే సంస్థ సాయంతో పూర్తి చేసింది.అమెరికాకు చెందిన ‘మైఖేల్ గ్రేవ్స్’, ‘మిన్హార్డ్’ సంస్థలు ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలను పరీక్షించాయి. వీటికి తోడు మరో 30 కన్సెల్టెన్సీ సంస్థలు ఈ ప్రాజెక్టు కోసం పనిచేశాయి. విగ్రహ డిజైన్‌ను పరీక్షించే బాధ్యతను ఏజీస్ ఇండియా, టాటా కన్సల్టెంట్స్ అండ్ ఇంజినీర్స్‌కు అప్పగించారు.


1947లో భారతదేశానికి స్వతంత్రం లభించిన తర్వాత దేశ ఉప ప్రధానిగా పటేల్ పనిచేశారు. అప్పట్లో భారతదేశంలో కలిసేందుకు విముఖంగా ఉన్న, విభేదిస్తున్న పలు రాష్ట్రాలను జాతీయవాది అయిన పటేల్‌ ఒప్పించి, ఏకం చేసి భారతదేశంలో ఐక్యం చేసినందుకు.. ఆయన్ను భారత దేశ ఉక్కు మనిషి (ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా) అని కూడా పిలుస్తుంటారు. భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేసిన నెహ్రూ వంశం పట్ల పక్షపాతం వల్ల చరిత్రలో సర్దార్ పటేల్‌కు సముచిత స్థానం లభించలేదని చాలామంది హిందూ జాతీయవాదులు భావిస్తుంటారు.




మరింత సమాచారం తెలుసుకోండి: