- అర్ధాంతరంగా నిలిచిన పోస్ట్‌ మెట్రిక్ వసతలు
ఆర్ధికంగా వెనుకపడిన విద్యార్థిణులకు ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం పోస్టుమెట్రిక్ వసతులను అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఉన్నతవిద్య   ఆర్థికభారం కాకూడదనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు. కానీ..  జిల్లాలో రెండు చోట్ల అర్ధంతరంగా ఈ వసతులు ఆగిపోయాయి. అందులో పాలకొండ ఒకటి. దీంతో ఆ ప్రాంత పేదవిద్యార్థులు నానాపాట్లు పడుతున్నారు.  క్షేత్రస్థాయిలో ప్రభుత్వ లక్ష్యాలను జిల్లా అధికారులు నీరుగారుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.


జిల్లాలో ప్రస్తుతం 11 BC పోస్టుమెట్రిక్  బాలిక  వసతిగృహాలు  వున్నాయి. పాతపట్నం , రాజాం , పలాస , టెక్కలి ,తదితర మండలాల్లో వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 1,900 మంది వసతి పొందుతున్నారు. ఇంకా అనేక మంది వసతి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వీరికి వసతి కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


వసతి సౌకర్యం అందుబాటులో లేకపోడంతో పేద, మధ్యతరగతి BC విద్యార్థిణులకు ఆర్ధిక భారం తీవ్ర సమస్యగా మారింది. గత ఏడాది నుంచి పలువురు విద్యార్థులు అద్దె గృహాలలో ఉంటూ చదువుకున్నారు. దీని వల్ల ప్రతీ విద్యార్థికి రూ.౩౦౦౦ పైగా వ్యయం అవుతోంది. అద్దె గృహాల్లో ఉంటూ విద్యార్థులు చదుకునేందుకు,  భద్రతలేని కారణంగా కొందరు తల్లితండ్రులు వారిని మధ్యలోనే చదువును మానిపించేస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: