మొత్తానికి  ఆంధ్రాలో బలపడటానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. ఇప్పటికే  టీడీపీ నేతలను తమలో కలిపేసుకున్న బీజేపీ అగ్రనాయకత్వం.. అలాగే గత కొన్ని రోజులు నుండి  కాపు సామాజిక వర్గాన్ని కూడా తమలో కలుపుకోవాటాకి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.  అందులో భాగంగానే  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి  కాషాయ జెండా కప్పటానికి  పవన్ మీద ఒత్తిడి తెస్తోందట.  కాషాయ జెండా కప్పుకుంటే  రాజ్యసభ సీటు అని కూడా చెబుతుందట. అయితే  పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించకుండా..  బీజేపీకి ఒక ఆఫర్ ఇచ్చాడట..  ఏపీకి ప్రత్యేక  హోదా ఇస్తే.. బీజేపీతో కలిసి పని చేస్తామని పవన్ బీజేపీ వాళ్లకు చెప్పాడట అని జనసేన నాయకులు మీడియాకి లీకులు ఇచ్చుకుంటూ  పబ్లసిటీ స్టంటు చేస్తున్నారు.       


పవన్ ఎందుకు ఇలా అయిపోతున్నాడు ?   నిజానికి పవన్ పార్టీ ప్రకటించిన రోజున జనసేన పరిస్థితికి... ఈ రోజు జనసేన పరిస్థితికి  వ్యత్యాసమే లేదు. అంటే ఇన్ని సంవత్సరాల్లో పవన్ సాధించింది ఏమిటి ?  ఏమి లేనట్టేగా.  అసలు పవన్ అమాయకత్వానికి కోప్పడాలో  లేక  కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడులే పాపం అని జాలిపడాలో తెలియట్లేదు.  అయినా పవన్ మాత్రం  వాస్తవ పరిస్థితులను అసలు  పరిశీలిస్తోన్నట్లు లేదు.  రోజురోజుకి ప్రజల్లో  పవన్ నమ్మకాన్ని కోల్పో తున్నాడు. ఇప్పటికైనా ముందుచూపు రాజకీయాలు చేస్తూ.. జనసేనను ప్రజల్లో తీసుకువెళ్లే కార్యక్రమాల్లో నిత్యం చేస్తూ ఉంటే..  పవన్ కి  రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మొన్న ఎన్నికల ఫలితాలే  మళ్ళీ మళ్ళీ ఎదురవుతాయి.   


మరింత సమాచారం తెలుసుకోండి: