- అనుకున్నట్టుగా జరిగితే సర్కారు బడులకు బలం
.ఒకప్పుడు మాబిడ్డ ఆ ప్రైవేటు స్కూలులో చదువుతున్నాడనే గొప్పపేరు నుంచి మాపిల్లాడు పలానా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాడనే స్థానికి ప్రభుత్వ పాఠశాలలను తీసుకెళ్లే స్థితికి సీఎం అత్యంత సాహసోపేతమైన చర్యలు తీసుకోబోతున్నారు…ఈ చర్యలతో నిజంగానే యావత్ దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల విద్యావ్యవస్థ కోసం సుదీర్ఘంగా చర్చించనుంది. అంతేకాదు, మొత్తం చర్యలు అమలు జరిగితే దేశ విదేశాల విద్యావేత్తలు కూడా ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల కోసం అధ్యయం చేసే స్థాయికి ఎదుగుతాయనడంతో ఎలాంటి సందేహం లేదు…


విద్య, వైద్యం, మౌళిక సదుపాయాల కల్పన ఏ స్థాయిలో జరుగుతుందో తెలుసుకుంటే ప్రతీ ఒక్కరూ ఔరా అనాల్సిందే. ఎక్కడైతే విద్య పూర్తిస్థాయిలో విద్యార్ధులకు అందుతుందో ఆ రాష్ట్రం, ఆ దేశం అన్నింటా అభివ్రుద్ధి చెందుతుందనే మాటను నిజం చేస్తూ వైఎస్ జగన్ ఈ నిర్ణయానికి వస్తున్నట్టు తెలుస్తుంది. ఒకరంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల నుంచి తీవ్రమైన వ్యతిరేక వ్యక్తం అవుతున్నా ఎవరినీ పట్టించుకోకుండా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని సీఎం నిర్ణయించారట.


ఇదే జరిగితే నిజంగా ప్రైవేటు పాఠశాలలు దోపిడీ దందాకు చెక్‌ పడటం  ఖాయమని చెబుతున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన ఏ ప్రభుత్వాలు పాఠశాల విద్యలో ఇన్ని మార్పులు చేయాలనే ఆలోచన చేయలేదు. మొదటి సీఎంగా వైఎస్ జగన్ ఈ ప్రతిపాదనలు అమలు చేసి ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల విద్య దేశానికే తలమానికంగా చేయాలని చూస్తున్నారు…దీనికి తోడు అమ్మఒడి పథకం అమలు కూడా జరుగుతుండటంతో ఫలితాలు కూడా అదే స్థాయిలో వస్తాయని  భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: