వాట్సప్.. ఇప్పుడు దాదాపు ప్రతి స్మార్ట్ ఫోన్‌లోనూ ఉన్న యాప్ ఇది. ఉదయం లేస్తూనే వాట్సప్ చూడటంతోనే ఎంతో మంది రోజు ప్రారంభం అవుతుంది. వాట్సప్ చెక్ చేసుకోవడం, స్టాటస్ చూసుకోవడం.. గ్రూపుల్లో మెస్సేజులు పెట్టడం ఇప్పుడు ప్రతి ఒక్కరికీ నిత్యకృత్యం అయ్యింది.


కొందరు మాత్రం దీన్ని పనికిమాలిన వ్యవహారంగా చూస్తుంటారు. వాట్సప్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా సమయం వృథా అవుతుందని విమర్శిస్తుంటారు. కానీ వాట్సప్ ద్వారా మానవ సంబంధాలు మెరుగవుతున్నాయని ఓ అధ్యయనం తేల్చింది.


ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హ్యూమన్ - కంప్యూటర్ అనే ఈ అధ్యయనంలో వాట్సప్ ఎక్కువగా వాడే వారు... కుటుంబ సభ్యులు, బంధువులతోనూ సన్నిహితంగా ఉంటారట. గ్రూప్ ఛాట్ సభ్యుల మానసిక ఆరోగ్యంపై పాజిటివ్ ప్రభావం చూపుతుందట. అదీ సంగతి ఇంకేం.. వాట్సప్ వాడుతున్నందుకు మీరూ సంతోషపడండి.


మరింత సమాచారం తెలుసుకోండి: