వారణాశి రామ్‌ మాధవ్‌ - ఉరఫ్ రామ్‌ మాధవ్‌ - భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపి మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో ప్రధానంగా ఫోకస్ అవుతున్న భావి భారత బీజేపి ప్రధాని అభ్యర్ధి - రచయిత మరియు జర్నలిస్టు - అనేక పుస్తకాలను రచించాడు. అతడు రాసిన ప్రస్తుత పుస్తకం "అన్‌ ఈజీ నైబర్స్" (50 యేళ్ళ యుద్ధం తరువాత భారత మరియు చైనా) అంతేకాదు కాశ్మీర్ నుండి సెవెన్ సిస్టర్స్ అనబడే ఉత్తర ఈశాన్య రాష్ట్రాలను ముఖ్యంగా అస్సాంను బీజేపికి దగ్గర చేసిన రాజకీయ వ్యూహకర్త - విజయాలను ధీటుగా రచించగల ప్రొఫెషనల్ రాజకీయ వ్యూహకర్త దిట్టగా ఆయనకు పేరుంది. 
Image result for ram madhav bjp strategies in ap

పశ్చిమ బెంగాల్లో దీదీ మమతకు ముచ్చెమటలు పట్టించిన రాజనీతిఙ్జుడు - నేడు ఉభయ తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారని సమాచారం. దక్షిణాదిన బీజేపి ఆనుపానులు విస్తరింప జేసి 2024 ఎన్నికల నాటికి విజయ యాత్ర కొనసాగించటానికి శ్రీకారం చుట్టారని తెలుస్తుంది. 
Image result for uneasy neighbours india and china after fifty years of the war
తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన వారణాశి రామ్‌ మాధవ్‌ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్ చేశారు. మైసూరు యూనివర్శిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో పీజీ చేశాడు.

Image result for ram madhav bjp with ap leaders strategies in ap
"ఏపీలో ఇప్పుడు మనమే ప్రతిపక్షం పాత్ర పోషించాల్సి ఉంది. రానున్న రోజుల్లో శాసనసభలో మనకు కొందరు సభ్యులు కూడా రాబోతున్నారు" అన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ మాటలతో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయకుడు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఉన్న 23మంది ఎమ్మెల్యేలనూ బీజేపీ లాగేసు కుంటుందని ఆందోళన చెందుతున్నారట. 
Image result for ram madhav bjp with ap leaders strategies in ap
గత ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలను వెలికితీయడంతో పాటు దూకుడుగా వెళుతున్న ప్రస్తుత ప్రభుత్వ విధానాల లోపాలను కూడా ఎత్తి చూపాల్సిన బాధ్యత మనపై ఉందని, అందుకోసం, మనకు కొంతమంది ఎమ్మెల్యేలు త్వరలో రాబోతున్నారని రాంమాధవ్ పార్టీ నేతలతో చెప్పినట్లు సమాచారం. ఆదివారం ఆయన పార్టీ నాయకులతో సమావేశమై 2024ఎన్నికల నాటికి బీజేపిని ఏపిలో అధికారం లోకి తీసుకు రావాల్సిన వ్యూహా, ప్రతి వ్యూహాలపై చర్చించారు. 

Image result for ram madhav bjp with ap leaders strategies in ap
రానున్న రోజుల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి భారీ ఎత్తున ప్రజాప్రతి నిధులు బీజేపీలోకి వలసలు రాబోతున్నట్లు ఆయన తెలిపారు. ఇదే సమయంలో జనసేన పార్టీ నుంచి కూడా కీలక నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న విషయాన్ని నేతల వద్ద ప్రస్తావించారు. బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలోకి వచ్చేవారు ఏవిధంగా వ్యవహరించాల్సి ఉంటుంది, ఇందుకు పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యలు అనే విషయాలపై రాష్ట్రనేతల అభిప్రాయాలను ఆయన సేకరించినట్లు చెబుతున్నారు. 

Image result for ram madhav bjp with ap leaders strategies in ap

ఇప్పటికిప్పుడు ప్రతిపక్షమైన తెలుగుదేశం కోలుకునే పరిస్థితులు లేవని - ఈ శూన్యత నుంచే బీజేపీని పటిష్టం చేయడానికి, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గరకు చేర్చే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.  దేశవ్యాప్తంగా జలై 6 నుంచి ఆగష్టు 11 వరకు చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 20 శాతం సభ్యత్వ నమోదును సాధించాలంటూ రాష్ట్ర నాయకత్వానికి రామ్‌మాధవ్‌ దిశానిర్దేశం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: