జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గోరు..  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై పోరాటం  ప్రారంభించటానికి సిద్దమవుతున్నాడట. కాకపోతే  ఆ పోరాటం ఎందుకు..? ఏ అంశం మీద ? అసలు ఎలా పోరాడబోతున్నారు ? ప్రణాళికలు ఏమిటి ? లాంటి విషయాలు ఏవీ  పవన్ బాబును అడగకూడదు. ఎందుకంటే..  పాపం ఆ విషయాలు ఆయనకి కూడా తెలియదాయ్యే.  ప్రశ్నించాడనికే పుట్టాను అన్న మన పవన్ బాబుకి... ఆ తరువాత బాబుగోరి సానిహిత్యంలో  'సీఎం' అవ్వాలనే ఆశ పుట్టుకొచ్చింది. ఎన్నికలకు ముందు అయితే.. ఏకంగా  ఏపీకి కాబోయే సీఎం నేనే అని  ఓవర్ గా పేలారు మన పీకే బాబు. తీరా ఫలితాలు వచ్చే సరికి.. ఈ మాత్రం దానికి  పీకే  అసలు పార్టీ పెట్టాలా ? అన్న పరిస్థితికి చేరింది జనసేన. అసలు జనసేన దాకా ఎందుకులే,  మన పీకేగారి పరిస్థితే అధోగతి మాదిరిగా  తయారైంది. రెండు చోట్ల పోటీ చేసినా.. చివరికీ పీకే బాబును చూసి  'అరె పాపం' అని జన సైనికులు కూడా జాలిపడ్డారు. 



పైగా ఎన్నికల ప్రచారంలో  తానూ ఎన్టీఆర్ తో పోల్చుకుంటూ.. ఎన్టీఆర్ కూడా  అరవై ఏళ్ళు దాటాక రాజకీయాల్లోకి వచ్చారు, కానీ నేను మాత్రం స్టార్ డమ్ ని వదులుకొని మీ కోసం  రాజకీయాల్లోకి వచ్చానని అప్పట్లో  పీకే చెప్పుకొచ్చారు.  అప్పుడు  పీకే మాటలను  జనం కూడా బాగానే సీరియస్ గా తీసుకున్నట్లు ఉన్నారు. మాట్లాడితే ఎన్టీఆర్ - వైఎస్సార్ లాంటి వ్యక్తులతో పోల్చుకోవద్దు.. అలాగే  మా కోసం నువ్వేం  త్యాగాలు చెయ్యద్దు, అని పీకే బాబును విదిలించి కొట్టారు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు.  సరే.. అయిపోయిందేదో అయిపొయిందని ఎన్నికల తరువాత అయినా,  తనది బలుపు కాదు, వాపు అని తెలుసుకోవాలిగా.. అరె.. అచ్చం బాబుగోరు లాగే   పోరాటం చేస్తాం, అవినీతికి వ్యతిరేకంగా పని చేసేలా చేస్తాం,  రాజకీయాలను మార్చేస్తాం లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.  ఇప్పటికైనా జనసేనాని  సోషల్ మీడియాలో జనసేనికుల హడావుడి చూసి  ఆవేశపడకుండా శుభ్రంగా సినిమాలు చేసుకోవడం బెటర్ అని  మెగా అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: