వై ఎస్ జగన్ అధికారంలోకి  వచ్చాక,  గతంలో  ఏ ముఖ్యమంత్రి  తీసుకొని ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు  ఒక్క నెలలోనే తీసుకుని..  ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారారు. ఈ సంచలనాలే ఇప్పుడు  బాబుగోరికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. దీనికి తోడు  గతంలో బాబు ప్రభుత్వం చేసిన అవినీతికి సంబంధించిన లిస్ట్ ను వెలికి తీసే పనిలో ఉన్నాడు  జగన్.  ముఖ్యంగా  సోలార్ మరియు విండ్ పవర్ ధరల విషయంలో భారీ అవకతవకలు జరిగాయని.. ఈ అవకతవకల ద్వారా చంద్రబాబు ప్రభుత్వం దాదాపు 2600 కోట్ల అవినీతికి పాల్పడిందని అప్పటి అధికారులు జగన్ దృష్టికి తీసుకొచ్చారట.  


దాంతో  సోలార్ మరియు విండ్ పవర్ పై  ఒక సమగ్ర నివేదికను తనకు అందించాలని జగన్  ఒక బృందాన్ని కూడా  నియమించాడట.  మరి బాబుగోరి  ప్రభుత్వం  సోలార్ మరియు విండ్ పవర్ పై   చేసిన  2600 కోట్ల అవినీతి నిజమే అయితే... ఆ అవినీతికి సంబంధించి  స్పష్టమైన అధరాలు దొరికేతే.. ఇక బాబుగోరి పరిస్థితి ప్రత్యేకంగా ముచ్చటించుకోక్కర్లేదు.  ఇక టీడీపీని పప్పుగోరే ముందుండి నడపాలి. ఎలాగూ మన పప్పుగోరు నడపలేరు కాబట్టి.. జగన్ కి ప్రతిపక్షమే లేకుండా పోతోంది. అప్పుడు ప్రతిపక్ష పాత్ర  మేమే పోషిస్తాం అని మన 'పవన్ బాబు' ఎలాగూ స్టేట్మెంట్ ఇస్తారనుకోండి అది వేరే విషయం.  


ఏమైనా జగన్ ప్లాన్ చూస్తుంటే తెలుగుదేశం పార్టీని ఏపీలో ఉంచేలా లేడని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.  కానీ రాజకీయంలో పండిపోయిన బాబును నిలువరించడం వైస్సార్ కే సాధ్యం కాలేదు, మరి జగన్ వల్ల అవుతుందా ? నిజంగా జగన్ కి ఇది క్లిష్టమైన పరిస్థితే. రోజులూ గడిచేకొద్దీ బాబు బుర్ర జగన్ పైనే పని చేయడం మొదలు పెడుతుంది.  అప్పుడు జగన్ ఎంత గొప్ప పరిపాలన చేసినా..  పాలనలోని కొన్ని లోపాలు జనంలోకి బలంగా  వెళ్తాయి.  అందుకే ఈ లోపే బాబుని లోపలకి పంపాలని జగన్ తాపత్రయం. మరి ఏం జరుగుతుందో రానున్న రోజులే నిర్ణయించాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: