సాధారణంగా రాజకీయాలు అంటే గెలిచినవారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్న విషయం తెలిసిందే.  ముఖ్యంగా అధికార పార్టీ ఏదైనా ఆ పార్టీవైపు ఎక్కువ మొగ్గు చూపిస్తుంటారు రాజకీయ నాయకులు.  చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు ఇదే ఫార్ములా ఫాలో అవుతుంటారు.  ప్రస్తుతం ఏపిలో వైసీపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. 

ఇక కేంద్రంలో బీజేపీ పాలనలో ఉంది..ప్రధానిగా రెండో సారి నరేంద్ర మోదీ పాలన కొనసాగిస్తున్నారు.  దాంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా చాలా మంది నేతలు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సైతం కొంత మంది కాంగ్రెస్, టీడీపీ నేతలు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు.  తాజాగా చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే హేమలత బీజేపీలో చేరారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున సత్యవేడు నుంచి గెలిచిన హేమలత 2014, 2019 ఎన్నికల్లో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు నాగలాపురం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మూర్తిరెడ్డి సైతం బీజేపీలో చేరారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: