తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భద్రత తగ్గింపు విషయంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హైకోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  తాను మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్నానని.. తనకు రాష్ట్రప్రభుత్వం తగ్గించిన భద్రతను పెంచాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. పాత భద్రతను పునరుద్ధరించాలంటూ సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందని, కావాలనే రాజకీయ కారణాలతో ఆయనకు భద్రతని తగ్గించారని చంద్రబాబు తరఫు న్యాయవాది సుబ్బారావు కోర్టులో వాదించారు.ఈ కేసులోవాదనలు ముగిసాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేశారు.

 

త‌న‌కు భ‌ద్ర‌త త‌గ్గించిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లపాటు సీఎంగా, అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్‌కు 2014 నుంచి 2019కు తొలి ముఖ్యమంత్రిగా వ్యవహరించానని పిటిషన్ పేర్కొన్నారు. అంతేగాక ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించానని.. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నానని తెలిపారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా ఉన్న వారు నాకు వ్యక్తిగత భద్రత తగ్గించారని.. అలాగే నా రెండు నివాసాల వద్ద కూడా భద్రతను తగ్గించారని పేర్కొన్నారు. తాను సీఎంగా ఉండగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం, ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు తీసుకున్న పలు చర్యల కారణంగా త‌న ప్రాణానికి ముప్పు ఏర్పడిందన్న నివేదికల ఆధారంగా కేంద్రప్రభుత్వం జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించిందని చ్వ్ర‌మిము తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా భద్రతను కుదించారంటూ వెల్లడించారు. తాను మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్నానని, 2003 అక్టోబరు 1న తనపై అలిపిరి వద్ద దాడి జరిగిందని గుర్తు చేశారు. వీటన్నిటి నేపథ్యంలోనే తనకు జడ్‌ ప్లస్‌ భద్రత ఉందన్నారు.

 

అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్ ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌ న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు.  తామెక్కడా చంద్రబాబుకు భద్రత తగ్గించలేదనిఇవ్వాల్సిన భద్రత కంటే ఎక్కువే ఇస్తున్నామని, మాజీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబుకి 58 మంది భద్రతా సిబ్బందిని మాత్రమే ఇవ్వాల్సి ఉందని.. అయితే ప్రస్తుతం తాము 74 మందిని ఇచ్చామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం చంద్రబాబుకు ఎంతమందిని, ఎక్కడెక్కడ, ఏయే స్థానాల్లో భద్రత కల్పిస్తున్నారో వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం ఈ తీర్పును వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: