అరంగేట్రం హైలెట్‌గా జరిగినా .... ఆదరణ శూన్యంగా మారింది. ఇదీ తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ (పి.కె) పరిస్థితి. 2019 ఎన్నికల్లో సుమారు అన్ని స్ధానాల్లో నూ పోటీచేసినా ఫలితం ఆశించనంత దక్కలేదు. సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ, పవన్‌ అన్నగారు సినీగ్లామర్‌ ఉన్న వ్యక్తి నాగబాబు వంటి యమాహెమీలను బరిలో దించినా చివరికి ఓ మాజీ ఎమ్మెల్యే రాజోలు నియోజకవర్గం నుంచి గెలుపొందడం ఆ పార్టీ కేడర్‌ జీర్ణించుకోలేని పరిస్థితి. 


పీకే గాజువాక, బీమవరం నియోజక వర్గాల నుంచి పోటీ చేసినా ప్రయోజనంలేకపోయింది. ఇంతటి ఘోర పరాజయం ఆ పార్టీని అవహేళన చేస్తుంటే తాజా రాజకీయ పరిణామాలు ఆ పార్టీ కేడర్‌ను మరింత క్షోభకు నెడుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని దెబ్బతీసేందుకు ఒక పక్క ప్రతిపక్షం కుట్రలు చేస్తుండగా మరో పక్క స్నేహం ముసుగులో భారతీయ జనతాపార్టీ కుతుంత్రాలు చేస్తున్నట్టు విమర్శలు వినవస్తున్నాయి. 


జనసేనకు జనాధరణ లేదని 2019 ఎన్నికలు స్పష్టం చేసినప్పటికీ రాజోలు ఎమ్మెల్యే రాపాక ప్రసాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో కలిసేందుకు విముఖత చూపినప్పటికీ ముఖ్యమంత్రి నిర్ధ్వంధంగా తోసిపుచ్చారు. కాగా పవన్‌ కళ్యాణ్‌ ను బీజేపీ ఒక పక్క నుంచి దువ్వుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన బీజేపీకి మొగ్గినట్టైతే మొత్తంగా జనసేనను పీకేసినట్టే అవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ పరిణామం వాస్తవరూపం దాల్చితే పవన్‌ కళ్యాణ్‌ మొత్తంగా రాష్ట్ర ప్రజానీకంలో విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోతాడని చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: