మహాత్ముడు కళలుకన్న గ్రామ స్వరాజ్యం సాకారానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సారధ్యంలో అడుగులు పడుతున్నాయి. పల్లె నుంచే పాలన అందేలా వైస్సార్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజాగా గ్రామం సచివాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి ఇందుకు తగ్గ కసరత్తు చేసి, తద్వారా గ్రామీణ ప్రజలకు పూర్తిగా ఇబ్బందులు తొలగిపోవాలని పంచాయితీరాజ్ శాఖకు ఈ బాధ్యతలను అప్పగించనున్నారు.


గ్రామం జనాభా ప్రాతిపదికను ఏర్పాటు కానున్న ఈ సచివాలయాలు ఆయా ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని అవసరాలకు ప్రధాన కేంద్రం కానున్నాయి. ఒక్కో గ్రామ సచివాలయంలో స్థానికంగా ఉంటున్నా అర్హుల్లో 10 మందిని ప్రభుత్వ ఎద్యోగులుగా నియమించి గ్రామ పాలన సక్రమంగా, పారదర్శకంగా నిర్వర్తించేలా ఆదేసించారు. అయితే ఈ ఉద్యోగాలపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలను వెలువరించనుంది.

అలాగే వీరే కాకుండా ప్రతి 50 కుటుంబాలకు ఒక్కో వాలంటీర్ చొప్పున నియామకాలు జరుగనున్నాయి. వీరంతా ఆయా పరిధిలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సామాజిక బాధ్యతతో సేవ చేయనున్నారు. జిల్లాలో మొత్తం 1141 గ్రామం పంచాయితీలున్నాయి. అయితే ఇందులో చాలా పంచాయతీల్లో వెయ్యికి లోపు జనాభా ఉన్న పంచాయితీలే అధికంగాఉన్నాయి. అయితే తాజాగా సచివాలయాలు ఏర్పాటులో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం ప్రతి 3 వేల మంది జనాభా గల పంచాయతీలకు ఓ సచివాలయాన్ని ఏర్పాటు చేసేలా నిబంధలను ప్రకటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: