జగన్మోహన్ రెడ్డకి భద్రత కల్పించటంలో భాగంగా పోలీసు ఉన్నతాధికారులు అత్యంతాధునిక పద్దతులను ఉపయోగించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ద్రోన్లను సెక్యురిటి కోసం ఉపయోగిస్తున్నారు. జగన్ భద్రత కోసం పోలీసు ఉన్నతాధికారులు నాలుగు ద్రోన్లను ఉపయోగంలోకి తెచ్చారు.

 

రాజధాని ప్రాంతంలోని తాడేపల్లి గ్రామంలో జగన్ నివసిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మామూలుగా పోలీసు బందోబస్తున్నా అది ఏమాత్రం సరిపోదు. పోలీసులు కొంత వరకే చూడగలరు. అదే ద్రోన్ కెమెరాలైతే కనీసం ఓ కిలోమీటర్ దూరం వరకూ చూడగలదు.

 

అందుకనే జగన్ ఇంటికి నాలుగు వైపులున్న రోడ్లపై నాలుగు ద్రోన్లను పోలీసులు భద్రత కోసం ఉపయోగించారు. నాలుగు రోడ్లపైన  ట్రాఫిక్ ఎలాగుంది ? జనాల కదలికలు, ఎక్కడైనా ఆందోళనలు జరుగుతున్నాయా ? కాన్వాయ్ కు ఏమైనా అవరోధాలు ఎదురవుతాయా ? లాంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ద్రోన్లు ఉపయోగపడుతున్నాయి.

 

నాలుగు ద్రోన్లను మంగళగిరిలోని పోలీసు హెడ్ క్వార్టర్సలోని టెక్ టవర్ కు అనుసంధానం చేశారు. ఈ టవర్లో ఐటి పరిజ్ఞానం ఉన్న పోలీసులు సిబ్బంది 24 గంటలూ పరిశీలిస్తునే ఉంటారు. కాబట్టి ఏమాత్రం అనుమానస్పదంగా కనిపించినా వెంటనే సిఎం భద్రతా సిబ్బందిని అలెర్ట్ చేయటానికి అవకాశాలుంటాయి. ద్రోన్ల పరిజ్ఞానం జగన్ భద్రతను మరింత సులువు చేస్తోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: