విజయసాయి రెడ్డి వైకాపాలో జగన్ కు నమ్మిన బంటుగా ఉన్నారు.  ఎంపీగా తెలుపొందిన ఆయనకు జాంగా తన ప్రభుత్వంలో ఓ కీలక బాధ్యతను అప్పగించిన సంగతి తెలిసిందే.  ప్రభుత్వ ప్రతినిధిగా నియమించింది.  దీనికి సంబంధించిన జీవో 68 ని రిలీజ్ చేసింది.  మరేమయిందో ఏమో తెలియదు... సడెన్ గా ఈ జీవోను వెనక్కి తీసుకుంది.  


విజయసాయి రెడ్డికి ఆ పదవిని ఇవ్వడం లేదని తేల్చిచెప్పారు జగన్.  కారణాలు ఏంటనే విషయం మాత్రం బయటకు రావడంలేదు.  విజయసాయి రెడ్డికి క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ ఇవ్వాలని పట్టుబట్టిన జగన్, సడెన్ గా ఇలా ఎందుకు యూ టర్న్ తీసుకున్నారో తెలియడం లేదు.  పార్టీలో కీలకంగా వ్యవహరించిన సజ్జల కృష్ణారెడ్డికి, అలాగే మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం కు క్యాబినెట్ హోదా ఇచ్చారు.  


గత ఎన్నికల్లో విజయసాయి రెడ్డి జగన్ వెన్నంటే ఉండి నడిచారు.  జగన్ కేసుల్లో భాగం పంచుకున్నారు. తననే నమ్ముకున్న వ్యక్తులకు జగన్ ఎప్పడు సపోర్ట్ చేస్తారు.  వాళ్ళను జాగ్రత్తగా చూసుకుంటారు.  అలాంటి జగన్ విజయసాయి రెడ్డి విషయంలో ఎందుకు యుటర్న్ తీసుకున్నారో తెలియడం లేదు.  విజయసాయి రెడ్డికి మరేదైనా కీలక పదవి అప్పగిస్తారేమో చూడాలి.  


విజయసాయి రెడ్డి కొత్త పోస్టుకు సంబంధించిన ఉత్తర్వులు రద్దు చేయడంలో రాష్ట్రంలో ఏవైనా పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా అన్నది అందరిలోనూ కలుగుతున్న సందేహం.  ఇప్పుడు ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా ఎవర్ని నియమిస్తారు అనే దానిపైనే అందరి చూపులు ఉన్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: