పాలకుడు ఎలా ఉండాలి. ఎలా ఉండకూడదు అనడానికి కళ్ళ ముందే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మచి చేస్తే జనం గుండెల్లో పెట్టుకుంటారు. చనిపోయినా కూడా ఫోటోలు ఇళ్ళల్లో పెట్టుకుని ఆరాధిస్తారు. మరి అటువంటి పాలకులు అన్నీ తరాలకు ఆదర్శమే.


ఇదిలా ఉండగా జగన్ ఎవరినీ మరచిపోరని, అందరినీ గుర్తుంచుకుంటారని, తనకు అవకాశం రాగానే వారికి తన వంతు సాయం చేయడానికి వెనకాడరని చెప్పేందుకు ఈ నలభై రోజుల్లోనే ఎన్నో ఉందంతాలు ఉన్నాయి. ఇక తన తండ్రితో పాటు ఆనాడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీఎం ప్రత్యేక కార్యదర్శి బాలసుబ్రమణ్యం కుటుంబానికి ఇప్పటి వరకూ న్యాయం జరగలేదు. ఆయన వారసురాలు కుమార్తె సింధూ సుబ్రమణ్యం బి ఎ చదివారు. 


ఆమెను గ్రూప్ వన్ పోస్ట్ లో జగన్ నియమించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. తన తండ్రి వెంటే ఉండి ఈ లోకాన్ని వీడిపోయిన బాలసుబ్రమణ్యం రుణం అలా జగన్ తీర్చుకున్నారన్నమాట. నాడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారందరిలో కొంతమందికి న్యాయం జరిగింది. ఇలా మిగిలిన వారిని వదిలేశారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఇలా ఈ పదేళ్ళలో ఏలిన ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలేదు. దంతో జగన్ సీఎం అయ్యాకే ఆ కుటుంబానికి న్యాయం జరిగింది. దీంతో జగన్ గ్రేట్ అంటున్నారు అంతా.



మరింత సమాచారం తెలుసుకోండి: