శుక్రవారం నాడు కేంద్ర  ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్  పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఫుడ్, వెజిటబుల్ జ్యూస్, ఇన్‌స్టంట్ కాఫీ , ఇన్‌స్టంట్ టీ, జెల్లీ, క్రిస్టల్స్, డ్రింకింగ్ చాక్లెట్స్,  ప్రాసెస్‌డ్ చీస్ తదితర వస్తువులపై పన్నులను పెంచారు.

ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. 'ముద్ర యోజన' దేశంలో సామాన్యుల జీవితాన్ని మార్చేసిందని తెలిపారు. నిర్మాణ రంగంలో కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చామనీ, దీంతో ఏడాది కాలంలోనే భారత్ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల మేర బలపడిందని చెప్పారు. భారత్ లోకి విదేశీ పెట్టుబడులు 64.37 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని చెప్పారు.

 

కేంద్ర బడ్జెట్ 2019 హైలెట్స్ :

 

- విమానయానం, మీడియా, యానిమేషన్, ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడుల పెంపునకు అంగీకారం

- ఇన్సూరెన్స్ ఇంటర్ మీడియరిస్ కు 100 శాతం ఎఫ్ డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)కు ఆమోదం

- 2022 నాటికల్లా అర్హులైన ప్రతీఒక్కరికీ ఉచిత ఎల్పీజీ కనెక్షన్ అందిస్తాం

- హర్-ఘర్-జల్ కింద 2024 నాటికి ప్రతీ ఇంటికి తాగునీరు అందిస్తాం

- రైల్వేశాఖలో ప్రైవేటు పెట్టుబడికి ఆహ్వానం

- మత్స్యకారుల కోసం ‘ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన’ ప్రారంభం

- మత్స్యశాఖ ఆధ్వర్యంలో జాలర్ల సమస్యల పరిష్కారం కోసమే ఈ పథకం తెచ్చాం

- ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా దేశంలో 97 శాతం ప్రాంతాలకు చేరుకునేలా మౌలికవసతులను అభివృద్ధి చేశాం

- విదేశీ, దేశవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు విధానపరమైన సంస్కరణలు

- న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ పీఎల్) అనే కంపెనీ ఏర్పాటు

- ఇస్రో ప్రయోగాలు, అభివృద్ధి ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందేందుకు ఎన్ఎస్పీఎల్ ఏర్పాటు చేశాం

- కేంద్ర అంతరిక్ష విభాగం ఆధ్వర్యంలో ఎన్ఎస్ పీఎల్ కంపెనీ పనిచేస్తుంది

- గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఊరు-పేదవారు-రైతు లక్ష్యంగా ‘అంత్యోద్యయ’ పథకం ప్రారంభం

2022 నాటికి 1.95 కోట్ల ఇళ్లను నిర్మిస్తాం.

- ప్రతీ నిరుపేద గ్రామీణ కుటుంబానికి ఇల్లు అందిస్తాం

- ఒకే బ్రాండ్ కు చెందిన రిటైల్ సెక్టార్ లో ఎఫ్ డీఐలకు నిబంధనలు సరళతరం

- జీఎస్టీ చెల్లింపునకు పేరు నమోదు చేసుకున్నవారికి 2 శాతం పన్ను రాయితీ

మరింత సమాచారం తెలుసుకోండి: