ఎన్నికల్లో ఓడిపోతానని ముందే తెలుసు...ఇది తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోటి నుండి జాలువారిన ఆణిముత్యాలు. అమెరికాలో మొదలైన తానా సభల్లో పవన్ కూడా ముఖ్యఅతిధిగా హాజరయ్యారు లేండి. ఆ సందర్భంగా మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోతానని తనకు ముందే తెలుసట. ఓటమి ముందే తెలిసినపుడు కాబోయే సిఎం తానే అని బహిరంగసభల్లో చెప్పిన విషయం తప్పే కదా ?

 

ఎవరైనా గెలుస్తామన్న నమ్మకంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తారు. కానీ పవన్ మాత్రం ఓటమి తెలిసి కూడా పోటీ చేసానని చెప్పటమంటే జనసేన తరపున పోటీ చేసిన వాళ్ళని మోసం చేసినట్లు కాదా ?  పైగా ఓటమిపై కారణాలు తనకు చాలా తెలుసంటున్నారు. కారణాలు తెలిసినా చెప్పరట.

 

విచిత్రమేమిటంటే ఓటమికి కారణాలు చెప్పటమంటే భయపడుతున్నట్లే అని కొత్త భాష్యం చెప్పారు. పవన్ చెప్పిందే నిజమనుకుంటే మరి ఫలితాలు వచ్చిన తర్వాత ఓడిపోయిన అభ్యర్ధులందరినీ పిలిచి ఫలితాలపై సమీక్షలు ఎందుకు చేసినట్లు ? ఓటమికి కారణాలను చెప్పమని అభ్యర్ధులను ఎందుకు అడిగినట్లు ?

.

సక్సెస్ కోసం బలంగా ఎంతకాలమైనా వెయిట్ చేస్తానని చెప్పిన ఉదాహరణ అంతకన్నా విచిత్రంగా ఉంది. ఖుషి సినిమా తర్వాత గబ్బర్ సింగ్ వచ్చే వరకూ హిట్ కోసం వెయిట్ చేశారట. అంటే సినిమాలు, రాజకీయాలు పవన్ దృష్టిలో ఒకటే అని తేలిపోయింది. హిట్ సినిమా కోసం వెయిట్ చేయటంలో పవన్ గొప్పతనమేమీ లేదు. సినిమాలు ఫ్లాప్ అవుతున్నా పవన్ ను పెట్టి సినిమాలు తీసిన నిర్మాతలదే గొప్పంతా. ఆ విషయం మరచిపోయి వింటున్నారు కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడటమే విచిత్రంగా ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: