స్మార్టు సిటీ ప్రహేళిక కాకినాడ నగరప్రగతికి గొడ్డలిపెట్టులా తయారయ్యిందని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. స్థానిక సంస్థల భవిష్యనిధినుండి మినహాయించుకునే రీతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి ప్రాతిపదికన రూ.1000  కోట్ల రూపాయలు అడ్వాన్సుగా కేటాయించిన అయిదేళ్ళ స్మార్టు సిటీ ప్రణాళికకు ఈ ఏడాదితో కాలం చెల్లిపోతోందన్నారు. కార్పోరే షన్ కంపెనీ ఇప్పటికీ రూ.383కోట్ల రూపాయల పనులు చేపట్టగా రూ.193 కోట్ల రూపాయల బకాయిలు నిలిచి పోయాయని నిర్ధేశించిన ప్రకారం రూ.617 కోట్ల రూపాయలను వినియోగించుకోలేని దుస్థితిలో కాకినాడ కార్పోరేషన్ చేజార్చుకుందని రమణరాజుతెలిపారు. 


స్మార్టు సిటీ పేరిట వెచ్చించిన రూ. 383కోట్ల రూపాయల నిధుల్లోనూ 25శాతం కమీషన్లుగా దాదాపు రూ. 100 కోట్లరూపాయల అవినీతి విచ్చలవిడిగా జరిగిందని ప్రజాధనం తీవ్రంగా దుర్విని యోగం అయ్యిందన్నారు. ఈ పనులపై దర్యాప్తు జరగాల్సిన అవసరం వుందన్నారు. కార్పోరేషన్ యాక్టు కాదని  కంపెనీ చట్టం ప్రకారం ఇచ్చిన కాంట్రాక్టుల కారణంగానే  ఉన్నతస్థాయిలో అత్యు త్తమంగా దోచుకున్నారన్నారు. ఈనిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చినవికావని కాకినాడ కార్పోరేషన్కు జనాభా నిష్పత్తి ప్రకారం భవిష్యత్తులో వచ్చే తలసరిగ్రాంటులని వాటిని ముందుగా స్మార్ట్ పదకంతో దుర్వినియోగం చేసి దోచుకున్నారని ఈతీరు నగర ప్రగతికి గొడ్డలిపెట్టు వంటిదని రమణరాజు దుయ్యబట్టారు. 


                         
వెచ్చించిన నిధులలో నగరానికి డంపింగ్ యార్డు, సమ్మర్ స్టోరెజీ రిజర్వాయర్, మార్కెట్ దుకాణసముదాయాలు,  అదనపుపార్కులు, వంటివేవీ లభించలేదన్నారు. కేవలం గోడలకు చెట్లకు రంగులు పులమడం ద్వారా చూపరులకు అగుపించే పై పై మెరుగులతో కార్పోరేషన్ ఆర్ధిక స్థితిని అధ్వాన్నం చేయించారని రమణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. నగర గ్రామాల విలీనం జరగకుండా కాకినాడ ప్రగతి సాధ్యం కాదన్న విష యాన్ని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు. గుర్తించాలన్నారు. మహనగరంగా అభివృద్ది చెందాల్సిన కాకినాడ భవిష్యత్తును నిధుల దుర్వినియోగంతో చెలగాటమాడడం మాయనిమచ్చ వంటిదని పత్రికలకు విడుదల చేసిన ఒకప్రకటనలో తెలిపారు. నూతన రాష్ట్ర ప్రభుత్వం అన్నిస్థాయిల్లోనూ ఉన్నత స్థాయి విచారణ నిర్వహించి స్మార్టు సిటీ గాంబ్లింగ్ అరికట్టించి దోపిడీసొమ్ములు రికవరీచేయించాలని డిమాండ్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: