జగన్ వరసగా నిర్ణయాలు తీసుకుంటూ బిజీ అవుతున్నాడు.  ఎక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగా మారుతున్నది.  పింఛన్ పధకం, రైతు భరోసా పధకం, అమ్మఒడి పథకం వంటివి పాపులర్ అయ్యాయి.  అదే విధంగా జులై 8 వ తేదీన వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఓ పధకాన్ని ప్రవేశపెట్ట బోతున్నారని తెలుస్తోంది.  


ఈ పధకం అమలు చేస్తే రైతులకు మంచి జరుగుతుందని,ఫలితంగా రైతులకు గౌరవం పెరుగుతుందని జగన్ నమ్మకం.  మంచి పధకం కాబట్టి జులై 8 వ తేదీన ఈ పధకాన్ని అనౌన్స్ చేస్తున్నారట.  జులై 8 రైతు దినోత్సవం కాబట్టి ఆరోజున పులివెందులలో అరటి పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు.  


అక్కడే కొన్ని సంచలన ప్రకటనలు చేయబోతున్నారు.  ఈ ప్రకటనలు అన్ని రైతుల సంక్షేమం గురించే ఉంటాయని సమాచారం.  రైతే దేశానికీ వెన్నుముక అని గాంధీ మహాత్ముడు చెప్పిన విషయాలను నిజం చేయడానికి జగన్ కంకణం కట్టుకున్నారు.  


ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు అనే నినాదంతో పధకాలు ప్రవేశపెట్టబోతున్నారని వినికిడి.  జగన్ తీసుకుంటున్న షాకింగ్ నిర్ణయాలు ప్రతిపక్షాలను ఆశ్చర్యపరుస్తున్నాయి.  ఇచ్చిన హామీలన్నింటిని కూడా జగన్ అమలు చేస్తే... జగన్ కు తిరుగుండదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: