పవన్ కళ్యాణ్ ఒకనాడు నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రమోట్ చేసిన వాడే. 2014 ఎన్నికల ముందు మోడీని కలసి వచ్చిన ఆయన దేశానికి మోడీ నాయకత్వం కావాలని కోరుకున్నాడు. ఆ తరువాత ప్రత్యేక హోదా లేదు, పాచి పోయిన లడ్డూలు ఇచ్చారు అని హాట్ కామెంట్స్ చేసింది పవనే.


ఇక బీజేపీకి వ్యతిరేకంగా 2019 ఎన్నికల్లో బీఎస్పీ అధినేత మాయావతిని ప్రధాని అభ్యర్ధిగా చూడాలని ఉందని చెప్పి సంచలనం రేకెత్తించాడు. మోడీ అంటే భయం లేదంటూ పలు మార్లు గర్జించింది పవనే. ఇక ఎన్నికల ఫలితాల తరువాత ప్రత్యేక హోదా అన్నది ప్రజల నుంచి డిమాండ్ రావాలని, ఆ చైతన్యం ఏపీ జనాల్లో లేదని కాడి వదిలేశాడు.


ఇపుడు పవన్ అమెరికా టూర్లో ఉన్నారు. అక్కడ ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ని కలవడం చర్చలు జరపడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఇద్దరూ కూడా ఏపీ రాజకీయాలతో పాటు, దేశ రాజకీయల గురించి మాట్లాడుకున్నారని టాక్. ఏపీలో బీజేపీకి మంచి నాయకత్వం కోసం వెతుకుతున్న తరుణంలో పవన్ ఇలా బీజేపీ కీలక నేతతో చర్చలు జరపడం సంచలన పరిణామంగా చూడాలి అంటున్నారు. మరి ఈ ఇద్దరి భేటీ వల్ల  ఏం జరుగుతుందో కాలమే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: