పవన్ ఎప్పుడు ఆలోచించి మాట్లాడినా అందులో తత్వం ఉంటుంది. మంచి కొటేషన్స్ తో ఆసక్తి రేకెత్తిస్తాడు. తానా మహాసభలో తన లౌక్యం, తెలివి, జ్ఞానం, విజ్ఞానాన్ని కలగలిపి నెమ్మదిగా పవన్ మాట్లాడిన మాటలు నిజాయితీగా ఉన్నాయి. తెలుగోళ్లమే మనం, భారతీయులమే మనమందరం అంటూ పవన్ చేసిన ప్రసంగానికి విజిల్స్ పడ్డాయి. రాజకీయం మట్లాడినప్పుడు నిర్మొహమాటంగానే తన అభిప్రాయాలు చెప్పాడు. ఇప్పుడవే చర్చనీయాంశమయ్యాయి.

 

జైళ్లలో కూర్చుని వచ్చిన వాళ్లకే అంత ధైర్యం ఉండి , వారు అంత దర్జాగా తిరుగుతున్నప్పుడు సత్యాన్ని మాట్లాడే నేను ఎందుకు భయపడాలి.. ఓటమి నుంచి బయటకు రావడానికి 15 నిమిషాలు పట్టింది.. నన్నే ఓడించే శక్తులు ఉంటాయని తెలుసు.. అంటూ చేసిన వ్యాఖ్యలకు కాసేపు ఆడిటోరియం మొత్తం చప్పట్లతో దద్దరిల్లిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఆ వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. జైల్లో ఉన్న వ్యక్తులు.. అంటూ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలకు ఓ పార్టీ వాళ్లను ఇరకాటంలో పడేశాడు పవన్. ఇంకా.. “ఫలితాల అనంతరం తన పార్టీ ఆఫీసులో ఒక వ్యక్తి నేనేం చేయాలో పార్టీని ఎలా తీర్చిదిద్దాలో చెప్తున్నాడు. నువ్వు జనసేనకు ఓటేసావా అంటే.. వేయలేదు.. ఆ పార్టీకి వేశాను” అని అన్నాడని చెప్పాడు. అంటే.. పవన్ రాజకీయంగా ఎంతగా ఎదుగుదామనుకుంటున్నా పార్టీలోని వారే దెబ్బేస్తుంటే సినిమాల్లో నెంబర్ వన్ స్టేటస్ ను వదులుకుని వచ్చినోడికి ఈ మాత్రం బాధ సహజం. జనసేన జెండా పట్టుకుని వేరే పార్టీకి ఓటేయమని చెప్తున్నట్టే కదా.

 

ఆదర్శమైన భావాలతో అన్నీవదులుకుని వచ్చిన పవన్ కు, సమాజంతో పని లేదు నా పని నాది అని కోట్లు సంపాదించేవాళ్లకు తేడా లేకుండా చేస్తున్నారు.. ఇలాంటివాళ్లు. ఇదే ఆవేదనను తానా సభల్లో చెప్పుకున్నాడు. ఇలాంటి సంఘటనలతో పార్టీకి జరిగిన నష్టంతో పవన్ పడ్డ ఆవేదనను అర్ధం చేసుకోవాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: