సోషల్ మీడియా వేదికగా తప్పులు మాట్లాడటం పాక్ ప్రజా పతినిధులకు,టీవీ యాంకర్స్ కు అలవాటుగా మారిపోయింది.మొన్న పాక్ టీవీ ఛానెల్ లో ఓ యాంకర్ "యాపిల్ కంపెనీ"ని యాపిల్ పండు అనుకోని పప్పులో కాలేసింది.అలాగే పాక్ క్రికెట్ కెప్టెన్ సర్ఫరాజ్ మొన్న జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 500 రన్స్ చేస్తాం అని చెప్పి నెటిజన్ల చేతిలో పడ్డాడు.వీళ్ళపై నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

కొత్తగా పాక్ పొలిటీషియన్ ఖుర్రం నవాజ్ గండాపూర్ పై నెటిజన్లు ట్రోలింగ్ తో విరుచుకు పడుతున్నారు.అందుకు కారణం ఖుర్రం తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోనే.జీటీఏ వీడియో గేమ్ కు సంబంధించిన ఓ వీడియోను నిజమైనదిగా భావించి ఖుర్రం పోస్ట్ చేశారు.పైలెట్ చాకచక్యంతో తృటిలో పెద్దప్రమాదమే తప్పిందని ఆయన పేర్కొన్నారు.

దింతో ఖుర్రం పోస్టు పై నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోలింగ్ కి దిగారు.హలో అది అనుకరణ వీడియో... జీటీఏ గేమ్ కి సంబంధించినది.ఏది నిజమైనది.. ఏది గ్రాఫిక్స్ కూడా తెలియదా?అసలు నిజజీవితంలో ఇలా జరిగే అవకాశం ఉందా?అలా అయితే కేఎల్ఏం మరియు పనాం క్రాష్ నివరింపబడేది కదా అని నెటిజన్లు ఖుర్రం ను ఆడుకున్నారు.ఇంకో నెటిజన్ అయితే ఏకంగా "జనరేషన్ గ్యాప్" అంటూ ట్రోల్ చేసాడు. ఖుర్రం పాక్ మాజీ సైన్యాధికారి మరియు ప్రస్తుతం పాక్     అసెంబ్లీ మెంబర్.ఇక పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఇలాంటి తప్పుడు ట్వీట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఓ కవితని వేరే కవి రాశాడని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: