సాధారణంగా రోడ్లు పక్కన, లేదా హోటల్ళలో ఇంకా రెస్టారెంట్‌లకు వెళ్లి తింటూంటాం... అంతకు మించి మనం అద్భుతంగా ఎక్కడ తినగలం... మీరు ఇది చదివితే ఆశ్చర్యపోతారేమో... విమానం లోకూడా డిన్నర్ చేయోచ్చు... నిజమనండి. విమానంలోని రెస్టారెంట్‌లో భోజనమంటే.. కాస్త కొత్తగానే ఉంది కాదా..! విమానంలో రెస్టారెంట్లను సాధారణంగా ఎక్కడా చూసి ఉండం.


విమానంలో కూర్చోని చికెన్ ధమ్ బిర్యానీ తింటుంటే ఎలా అనిపిస్తుంది..? ఆ.. అనుభూతే వేరు.. కదా..! అలాగే.. విమానం విండో నుంచి ప్రకృతి అందాలను చూస్తూ.. భోజనం చేస్తూంటే ఆ కిక్కే వేరబ్బా..! మరి మీరు కూడా విమానంలో భోజనం చేయాలనుకుంటున్నారా..? మీరు తినెటప్పుడు భోజనం మీద పడదు. ఎందుకంటే ఇదీ గాలిలో ఎగరదు.. భూమి మీదే ఉంటుంది. విమానంలో భోజనం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు వెళ్లాల్సిందే... 


ఈ మధ్య ఢిల్లీలో ఓ పాత విమానంలో కొత్తగా ‘రన్ వే ఫుడ్’ అని స్టార్ట్ చేశారు. దానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. దీంతో.. దీన్నే విజయవాడలో ట్రై చేస్తున్నారు. పీ4 ఫ్యాక్టరీ నిర్వాహకులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతికి సమీపంలో విజయవాడ – గన్నవరంకి మధ్యలో ‘ఎయిరో‌ప్లైన్ రెస్టారెంట్’ రెడీ అవుతోంది. అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.


విమానం అంటే ఏంటో తెలియని వారిక, ఎప్పుడైన విమానం ఎక్కాలని అనుకునే వారికి ఇలాంటి సదుపాయాన్ని నిర్వహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఇది నిజంగా మనం విమానంలో ఉన్నట్లే ఉంటుంది. భోజన ప్రియులను కూడా ఎప్పుడు హోటళ్ళు, రెస్టారెంట్లు, క్యాడింలైట్ డినర్ల్ను కాకుండా మరో సరికొత్త ప్రయోగం కోసం ఇలా విమానంలో హోటల్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: