శ్రీకాకుళం ఇల్లాలోని ఇచ్చాపురం టిడిపి ఎంఎల్ఏ బెందాళం అశోక్ పై వైసిపి శ్రేణులు దాడి చేసినట్లు వస్తున్న ఆరోపణలై నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నియోజకవర్గంలోంని సోంపేట మండలంలో ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరైన ఎంఎల్ఏ అశోక్ పై వైసిపి నేతలు దాడి చేసినట్లు టిడిపి నేతలు పోలసులకు ఫిర్యాదు చేశారు.

 

సోంపేట మండలంలోని పలాసపురం గ్రామంలో ఆదివారం  రెండు పార్టీల మధ్య తోపులాటలు, చెప్పులు విసురుకోవటాలు జరిగింది వాస్తవం. అయితే ఇక్కడ టిడిపి నేతల ఓవర్ యాక్షన్ కూడా బాగా కనిపిస్తోంది. అనవసరంగా వైసిపి నేతలను టిడిపి కవ్వించినట్లే అర్ధమవుతోంది. ఎవరు ఎవరి మీద దాడులు చేసినా తప్పే.

 

నిజానికి ఇక్కడ జరిగిందేమిటంటే టిడిపి హయాంలో వైసిపి ఎంఎల్ఏలను ఏ కార్యక్రమానికి కూడా పిలిచేవారు కాదు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎందులోను భాగస్వాములను చేసింది లేదు. విషయం గ్రహించిన వైసిపి ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవటం మానేశారు. అలాంటిది ప్రభుత్వం మారిన తర్వాత కూడా టిడిపి తన వైఖరి మార్చుకోకపోవటమే గొడవలకు కారణాలవుతున్నాయి.

 

పలాసపురం గ్రామంలో  నిర్మించిన అంగన్వాడీ నూతన భవనం, పంచాయితీ కార్యాలయం, పాఠశాలలోని డిజిటల్ తరగతి ప్రారంభోత్సం జరిగింది. న్యాయంగ అయితే ఈ మూడు ప్రభుత్వ భవనాలే కాబట్టి వాటి ప్రారంభోత్సవాలు జరగాల్సింది కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే. కానీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎంఎల్ఏనే ప్రారంభించేశారు. దాంతో వైసిపి నేతలకు మండింది. అందుకే గొడవైంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: