గడచిన ఎన్నికల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన వై.యస్‌.జగన్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతకూడా సంచలన నిర్ణయాలతో ఆ వర్గాలకు పదవులు కట్టబెట్టారు. ఏకంగా ఐదుగుర్ని డిప్యూటీ సీఎంలు చేయడంతోపాటు, మంత్రివర్గంలోనూ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 60శాతానికిపైగా పదవులు కట్టబెట్టి చరిత్ర సృష్టించారు.

 

ఇప్పుడు ఇదే ఫార్ములా ప్రభుత్వంలోని మిగతా విభాగాలు కూడా అమలు చేస్తున్నాయి. న్యాయవిభాగంలో కూడా ప్రభుత్వ నియామకాల్లో ఇదే సూత్రం అమలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ నియమించిన 17 మంది జీపీల్లో కూడా ముఖ్యమంత్రి వై.యస్‌.జగన్‌ సామాజిక సూత్రాన్ని పాటించారు.

 

ఇద్దరు ఎస్సీలను, ఒక ఎస్టీని, ఒక ముస్లింని, 4గురు బీసీలను ప్రభుత్వ ప్లీడర్లగా నియమించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి 4, కాపులకు 2, బ్రాహ్మణులకు 2 చొప్పున జీపీలుగా నియమితులయ్యారు. మిగిలి ఉన్న 5 పోస్టుల భర్తీలో సీఎం నిర్దేశించిన సామాజిక సూత్రాన్ని పాటిస్తామని అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం స్పష్టంచేశారు. స్టాండింగ్‌ కౌన్సిల్, ఏజీపీల నియామకాల్లోనూ ఇదే పద్దతిని పాటిస్తామన్నారు. 50 శాతం పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయిస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: