గత వారం రోజులుగా కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే.  ఓవైపు కాంగ్రెస్-జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతుంటే.. మరోవైపు కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి చెందిన నేతలతో కమల దళంలో కలవరం మొదలైంది. ఇక ఊహించని విధంగా సంకీర్ణ సర్కార్‌లోని మంత్రులంతా రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రి కుమారస్వామికి అందజేశారు. 
అయితే కర్ణాటకలో సంక్షోభం మరింత ముదురుతోంది. కుమారస్వామి ప్రభుత్వం మరింత ఇబ్బందులు పడే పరిస్థితులు కనబడుతున్నాయి.

క్షణక్షణానికి పరిస్థితి మారుతోంది. మరొక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నగేష్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే, ఇప్పుడున్న మంత్రులంతా రాజీనామా చేసి... తిరుగుబాటు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించడానికే ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. మరి రాజకీయ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి. 

ఇప్పటి వరకు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు వెళ్లిపోయారు. అయినప్పటికీ ముంబైలో మకాం వేసిన కొంతమంది ఎమ్మెల్యేలు తమ వైపు వస్తారని సీఎం కుమారస్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు.  తాజాగా తమ ప్రభుత్వం సంక్షోభంలో లేదని, సమస్య పరిష్కారమైందని సీఎం కుమారస్వామి అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం యాధావిధిగా కొనసాగుతుందని ఆయన అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: