ముఖ్యమంత్రి.. ఈ పదవి అంటే జగన్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీఎం పదవి అంటే జగన్ కు ఇష్టం కాదు.. ప్రాణం.. ఎలాగైనా సరే ముఖ్యమంత్రి కావాలన్న కోరికను ఆయన బహిరంగంగానే చాలాసార్లు చెప్పారు కూడా.


మొత్తానికి 9 ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత నెలన్నర క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకారం చేసేరోజు.. జగన్ ప్రమాణం చేసిన తీరు గుర్తు చేసుకుంటే.. జగన్ అనే నేను.. అంటూ కొద్దిసేపు ఆగి ముసిముసిగా నవ్వుకున్నారు. ఎన్నాళ్లో వేచిన కోరిక తీరితే కలిగే సంతోషం అది.


అయితే సోమవారం ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జమ్మల మడుగు వెళ్లిన జగన్.. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆ ప్రసంగం కూడా ప్రమాణ స్వీకారం సమయంలో చేసిన తరహాలోనే ప్రారంభించారు. జగన్ అనే నేను.. అంటూ కొద్దిసేపు ఆగి ముసిముసినవ్వులు నవ్వారు.


అంతే కాదు.. ఈ జిల్లా ముద్దుబిడ్డను.. అంటూ తనకు తానే చెప్పుకున్నారు. ఎంతైనా సొంత జిల్లాలో తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు కదా.. ఆ సంబంరమే వేరు.. అది జగన్ ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆ సంబరంతో జగన్ ముఖారవిందం కళకళలాడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: