ఈ జీవులు, అంతరిస్తే ఏమవుతుందో తెలుసా?
జీవ వైవిధ్యానికి, మానవ మనుగడకు జీవజాతుల అవసరం కీలకం. అన్ని రకాల జంతువులు ,పక్షులు ప్రత్యేకంగానో.. పరోక్షంగానో.. మానవ ప్రయోజనకారులు . ప్రస్తుతం మారుతన్న జీవన విధానం వల్ల జీవ వైవిధ్యానికి కీడు కలుగుతోంది. కొన్ని జాతులు మానవుల వల్ల, కనుమరుగవుతుంటే... మరికొన్ని సహజంగా క్షీణదశకు చేరుకుంటున్నాయి. మితిమీరిన రసాయనాల వాడకం, సెల్‌ ఫోన్‌ టవర్ల వల్ల కొన్ని జీవజాతులు కనుమరుగవుతున్నాయి. సమాజం వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేక పోతే మానవ మనుగడకు ప్రమాదం అని, పర్యావరణ నిపుణులు అంటున్నారు. కనుమరుగవుతున్న తూనిగలు !! గుండ్రటి తల.. పొడవాటి రెక్కలు.. సన్నని తోక హెలికాప్టర్‌ లా ఉండే తూనిగలను చూస్తే అందరికీ ముచ్చటేస్తోంది. బాల్యంలో ప్రతీ ఒక్కరూ వాటితో ఆడుకునే ఉంటారు. నిజానికి ఇవి కీటకాలను తినే మాంసాహారులు. దోమల నివారణకు ఉపయోగపడుతుంటాయి. పంటలకు నష్టం కలిగించే శుత్రు పురుగులను తిని రైతులకు మేలు చేస్తాయి. రసాయాన ఎరువులు, పురుగు మందులు నీటి కాలుష్యంతో పొలాల్లో రసాయనాలు వాడకం వల్ల, ప్రస్తుతం తూనీగలు కనుమరుగవుతున్నాయి. అరుదై పోయిన ఉడుములు..! ఉడుములు అన్ని ప్రాంతాల్లోనూ సంచరిస్తుంటాయి. ఇవి సుమారు మూడున్నర కిలోల బరువు వరకు ఉంటాయి. భూమిలో బొరియాలు చేసి గుడ్లు పెట్టి వాటిని మట్టితో కప్పి వేయడం వీటి ప్రత్యేకత. ఇవి పంటలకు హానీ చేసే కీటకాలను ఆహారంగా తీసుకొని రైతుకు మేలు చేస్తాయి. వీటి మాంసం నడుంనొప్పులను తగ్గిస్తుందనే ఓ నమ్మకం వల్ల వేటగాళ్లు వీటికి ఉచ్చులు వేసి పట్టుకొని విక్రయిస్తుంటారు. వాన పాముల.. రైతు మిత్రులు..! సేంద్రియ సాగుకు అవసరం వర్మీకంపోస్టు. పొలాల్లో పశువ్యర్దాలు చల్లడం వల్ల భూమినుండి వానపాములు బైటకు వస్తాయి. భూమిని గుళ్ల పరిచి, సారవంతం చేస్తాయి. కొన్ని వేల సంఖ్యలో భూమి పై పొరల్లో ఉండి కంపోస్టును తయారు చేస్తాయి. ఇవి నేలలో బొరియాలు చేయడంతో నీటిని నిల్వ చేసుకునే శక్తి పెరుగుతోంది. వర్మీ కంపోస్ట్‌లో నత్రజని సహజంగా ఉంటుంది. ప్రస్తుతం రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకం పెరిగి నేలలో వానపాములు చనిపోతున్నాయి. దీంతో నేలలు సారం కోల్పోతున్నాయి. మచ్చుకైనా కానరాని పిచ్చుకలు ! గూడు కట్టుకోవడం అన్ని పక్షులది ఒక తీరైతే పిచ్చుకల గూడుది మరో ప్రత్యేకత. ఈత, తుమ్మ కొమ్మలకు చివరన గూల్లు కట్టుకుంటాయి. సాగుకు హాని చేసే, కీటకాలను అదుపులో ఉంచుతాయి. సెల్‌ ఫోన్‌ టవర్ల వల్ల ఇవి కూడా అంతరించి పోతున్నాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడే ఈ జీవులను కాపాడు కున్నపుడే మానవ జీవితానికి మనుగడ ఉంటుందని, రసాయన ఎరువులు తగ్గించి, చెట్లను పెంచడం వల్ల ఈ జీవుల మనుగడను కాపాడుకోవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: