వ్యవసాయం అంటే దండగ అనే చంద్రబాబు ప్రభుత్వంలా కాకుండా మహానేత వైఎస్సార్ స్ఫూర్తితో వ్యవసాయం అంటే పండుగ అనేలా రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలను వైఎస్సార్ తనయుడు,ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అందించనున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా పిఠాపురం మున్సిపల్ కళ్యాణమండపంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జరిగిన రైతు దినోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే దొరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 


వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దొరబాబు ప్రారంభించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత పంట బీమా,వడ్డీలేని రుణాలు,రైతు భరోసా పథకాలకు సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్యే దొరబాబు ఆవిష్కరించారు.అలాగే.,ఉత్తమ రైతులకు సన్మానం చేసి, ప్రశంసాపత్రాలు, మెమెంటో అందించారు. రైతుమిత్ర సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కులను ఆయన అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. 

కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన ప్రదర్శన శాలలను ఎమ్మెల్యే దొరబాబు సంద‌ర్శించారు. వ్యవసాయశాఖాధికారులు, వైసీపీ నాయకులు, కా‌ర్యకర్తలు,రైతులు పెద్దయెత్తున కార్యక్రమానికి హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: