తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి స్థాపించింది ఉన్నత ఆశయంతో. నాడు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మంచి విధానలతో ఆయన పార్టీ పెట్టారు. పార్టీ ప్రజలకు సేవ చేయాలన్నది ఆయన ఆశయం. అధికారమే పరమావధి కాదు అన్నది కూడా ఆయన ఆలోచన.


అయితే ఇప్పటి టీడీపీ నేతలకు ఎంతసేపు అధికారం మీదనే యావ కనిపిస్తోంది. ప్రతిపక్షంలో గట్టిగా నెల రోజుల పాటు కూడా ఉండలేకపోతున్నారు. దీనికి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాటలే  నిదర్శనం. ఇవాళ ఎన్నికలు మళ్లీ వస్తే చంద్రబాబు సీఎం అవడం ఖాయమని ఆయన అన్నారు. త్వరలో రానున్న జమిలి ఎన్నికలు ఎగిరి పడుతున్న అందరికీ సమాధానం చెప్తాయని పుల్లారావు అన్నారు.


కాగా, తనకు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లాలనే ఆలోచన లేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. ఇదంతా వైఎస్ ఆర్ కాంగ్రెస్ మైండ్ గేమ్ అని ఆయన అన్నారు. దీనివల్ల టిడిపి నుంచి ఒక్క కార్యకర్త కూడా పార్టీని వీడి బిజెపిలోకి వెళ్లరని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: