2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తరువాత ప్రతిపక్ష పార్టీ వైసీపీని ఇబ్బంది పెట్టడానికి పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. ఆ ప్రయత్నంలో భాగంగా 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ ఈ పార్టీ ఫిరాయింపుల వలన వైసీపీ పార్టీ ఏ మాత్రం బలహీనపడలేదు. 2019 ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 151 సీట్లు సాధించగా టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లు సాధించింది. 
 
టీడీపీ రాజ్యసభ ఎంపీలు నలుగురు ఇప్పటికే బీజేపీలోకి చేరారు. 18 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిధ్ధంగా ఉన్నట్లు ఆ పార్టీకి చెందినవారే చెబుతున్నారు. బీజేపీ చెబుతున్నట్లు 18 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడీతే మాత్రం తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర ప్రదేశ్లో భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీలో మిగులుతారు. బీజేపీ చెప్పినట్లు 18 మంది కాకపోయినా పది మంది ఎమ్మెల్యేలు మారినా పార్టీకి మాత్రం భారీగా నష్టం జరిగినట్లే. 
 
తెలుగుదేశం పార్టీ ఉన్న కొద్దిపాటి ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర ప్రదేశ్లో ప్రసుతం వైసీపీ తరువాత ప్రజల్లో అంతో ఇంతో బలంగా ఉన్నది తెలుగుదేశం పార్టీ మాత్రమే. తెలుగుదేశం ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడే అవకాశం మాత్రం ఉంది. మరి ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా టీడీపీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: