ముద్రగడ అంటేనే ఓ వణుకు. తాపీగా సాగుతున్న రాజకీయాల్లో ప్రకంపనలు స్రుష్టించడం ఆయన‌కే చెల్లు. చంద్రబాబు జమానాలో ముద్రగడ చేసిన గడబిడ అంతా ఇంతా కాదు. ముద్రగడ లేఖ‌లకు బాబు సర్కార్ షాకుల మీద షాకులు తినేది. చివరకి కాపులను టీడీపీకి దూరం చేయించడంలో ముద్రగడ పాత్ర చాలా కీలకమైంది.


ఇదిలా ఉండగా ఈ రోజు  సీఎమ్ జగన్ కి ముద్రగడ లేఖ రాశారు. అందులో  పొలిటికల్ ఘాట్ మసాలా ఏమీ లేదు కానీ చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పేశారు. చంద్రబాబు కాపులను దారుణంగా మోసం చేశారు. మీరు ఇపుడు సీఎంఅయ్యారంటే  మా కాపు జాతి మిమ్మల్ని గట్టిగా నమ్మి ఓటేసిందని నేను భావిస్తున్నారు. మీరు కూడా భావిస్తే మా జాతికి మేలు చేయండి అంటూ ముద్రగడ లేఖలో పేర్కోనడం విశేషం.


అదే విధంగా కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తానని అయిదేళ్ళు పొద్దు పుచ్చిన చంద్రబాబు కేంద్రం అగ్ర వర్ణాలకు ఇచ్చిన పది శాతం రిజర్వేషన్ల లొనే  అయిదు శాతం ఇచ్చారని ఆయన చెప్పారు. అయితే ఆ అయిదు శాతం రిజర్వేషన్లకు సంబంధించి జీవో మాత్రం ఇంకా రాలేదని ముద్రగడ అన్నారు. నాడు బాబు గ్లోబల్ ప్రచారం అలా చేసుకున్నారని కూడా విమర్శించారు.


సీఎం హోదాలో మీరు ఆ జీవోను విడుదల చేయించి కాపులను ఆదుకోవాలని ముద్రగడ ఆ లేఖలో కోరారు. ఈ విషయంలో సాధ్యమైనంత వేగంగా జీవో తెస్తే కాపు యువతకు విద్య, ఉదోగావకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆయన సూచించారు. మొత్తానికి కాపులకు న్యాయం కోసం ముద్రగడ జగన్ కి లేఖ రాయడం ద్వారా తిరిగి తన పోరాట పంధాను మొదలెట్టారనుకోవాలా.


మరింత సమాచారం తెలుసుకోండి: