సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఏ రాష్ట్రానికైనా ఖజానా నిండుగా ఉండాలి. ఆదాయం దండిగా ఉన్నప్పడే ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు అవకాశం ఉంటుంది. మరి రాష్ట్రాలకు ఆదాయాన్ని ఇచ్చే వనరులు ఏవి..


ఇందులో ముందువరుసలో ఉండేది ఆబ్కారీ శాఖ.. మద్యం అమ్మకాల ద్వారా, లైసెన్సుల ద్వారా, పర్మిట్ల ద్వారా ప్రభుత్వానికి ఆదయం పెద్ద ఎత్తున వస్తుంది. అందుకే సర్కారును పోషించే మహారాజ పోషకులం మేమని మందుబాబులు దర్జాగా చెప్పుకుంటుంటారు.


మరి అలాంటి మహా రాజపోషకులకు కష్టం కలిగించే పనులు ఏపీ సీఎం జగన్ చేస్తున్నారు. ఇప్పటికే మద్యం బెల్టు షాపులు తొలగించాలని ఆదేశాలు గట్టిగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సాయంత్రం ఆరు దాటితే మద్యం అమ్మకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు.


మరి ఇలా చేస్తే మద్యం అమ్మకాలు పడిపోవడం ఖాయం. మరి అదే జరిగితే సంక్షేమ కార్యక్రమాలకు సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే ప్రత్యామ్నాయ మార్గాలేమిటి.. ఇప్పుడు ఈ ప్రశ్న ఆలోచిపంజేస్తోంది. ఏదేమైనా జనం బాగు కోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తానంటున్న జగన్ పట్టుదలను మెచ్చుకోవాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: