ఆయన ఓ కేంద్రప్రభుత్వ ఉన్నత అధికారి.. కొంతకాలం ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్‌లో పని చేశారు. ఆ సమయంలో ఇప్పటి సీఎం జగన్ అక్రమాస్తుల కేసులను ఆయన డీల్ చేశాడంటారు.


జగన్ అక్రమాస్తుల గురించి ఆనాటి ఎల్లో మీడియాలో విస్తృతంగా కథనాలు రావడానికి ఈయన సోర్స్ ప్రధాన కారణమని చెబుతారు. ఈడీ కార్యాలయం నుంచి బదిలీ అయినా.. అనధికారికంగా నెలరోజుల పాటు విధుల్లో కొనసాగారట కూడా. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అనేక మంది టీడీపీ నేతలకు అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకోడానికి సహకరించినట్లు కూడా చెప్పుకుంటారు.


అయితే ఇప్పుడు ఆయనే స్వయంగా అక్రమాస్తుల కేసులో ఇరుక్కుపోయారు. ఆయన నివాసాలపై జరిపిన దాడుల్లో లెక్కకు మించిన ఆస్తులు దొరుకుతున్నాయి. విజయవాడ, హైదరాబాద్‌ కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు.


రూ. 200 కోట్లు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. అధికారులు ఇ‍ప్పటి వరకు గుర్తించిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. కంకిపాడులో మూడు స్థలాలు, ప్రొద్దుటూరులో ఇళ్లు, కానూరులో 360 గజాల స్థలం, రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్‌లో 300 గజాల స్థలం, మరో రెండు స్థలాలు, మదీనా గూడలో పది కుంటలు, విజయవాడ కంకిపాడులో 43 సెంట్లు, తుళ్లూరులో 42 సెంట్ల స్థలం, కంకిపాడులో 2.96 సెంట్ల స్థలం, బ్యాంకు ఖాతాలో భారీగా నగదును గుర్తించారు. శకునం చెప్పే బల్లి కుడితిలో పడటం అంటే ఇదేనేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: