మనిషి రోజు రోజుకీ ఎంత టెక్నాలజీకి పెంచుకుంటూ పోతున్నారంటే..ఒక్క ప్రాణం పోయడం మాత్రమే తక్కువ.  అయితే ఈ టెక్నాలజీ ఎంత పెరుగుతుందో వినాశనం కూడా అదే స్థాయిలో కలుగుతుంది.  ముఖ్యంగా ప్రయాణ సాధనాల విషయంలో రోజు రోజు కీ కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు.  నేల,నీరు,ఆకాశం ఎక్కడైనా సరే ప్రయాణ సౌలభ్యం కోసం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయాణ సాధనాల వల్ల మేలు ఎంతుందో కీడు కూడా అంతే ఉంది.  ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

అయితే ఇది నేలమీద అనుకుంటే పొరపాటే..నీటిపై, గాలిలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.  అయితే ఇవి ఎక్కువగా సాంకేతిక లోపావల్లే జరుగుతుంటాయి. తాజాగా  అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో గత సోమవారం చోటుచేసుకున్న ఘటన చూస్తే వాళ్లందరి ఒళ్లు జలదరిస్తుంది. జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా నుంచి డెల్టా ఫ్లైట్ 1425 అనే విమానం బాల్టిమోర్ నగరానికి బయలుదేరింది. విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానం ఇంజిన్ లోని ముందుభాగం ఊడిపోయి వేగంగా తిరుగుతున్న ప్రొపెల్లర్స్ లోకి వెళ్లి ఇరుక్కుంది. 

దీంతో పెద్దశబ్దంతో మంటలు రావడం ప్రారంభమయ్యాయి. అంతే అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని భయపడ్డారు. ఈ ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో విమానంలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒకదశలో తమ ప్రాణాలు పోతున్నాయి..గుడ్ బాయ్ అంటూ బందుమిత్రులకు సందేశాలు కూడా పంపారు. 

ఇదే సమయంలో ఓ ప్రయాణీకుడు కాస్త ధైర్యం చేసి ఈ ప్రమాదాన్ని వీడియో షూట్ చేశాడు. అయతే విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనంతరం ప్రయాణికులను మరో విమానంలో బాల్టిమోర్ కు పంపినట్లు డెల్టా కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: