ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సంచలన నిర్ణయాలు తీసుకొని సంచలన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. అతని పాలనలో మచ్చ లేకుండా ఉండేందుకు ఆచి తూచి అడుగులు వేస్తూ ముందడుగు వేస్తున్నాడు వైఎస్ జగన్. ప్రతిపక్షం ఎన్ని విమర్శలు చేసిన ప్రజలకు చెయ్యాల్సిన పనులను, వారికీ అందచెయ్యాల్సిన సంక్షేమ పథకాల కోసం అయన ఎంత కష్టపడుతున్నారు అనేది ప్రజలకు కూడా తెలుసు.  


పుట్టిన పసికందు నుంచి వృద్దుడు వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగ పడే పథకాలను వైఎస్ జగన్ తీసుకొచ్చాడు. అయితే వీటిని అమలు చేసే సమయంలోనే ఈ నెల 8న ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా ఆ రోజుని రైతు దినోత్సవంగా ప్రకటించారు. అలాగే కడపలో కనువిని ఎరుగని రీతిలో వైఎస్ఆర్ జయంతి నిర్వహించారు. అయితే ఆ వేడుకకు వచ్చిన తన చెల్లి (షర్మిల) కొడుకు పై మీడియా కన్ను పడింది. 


అంతే ఇంకా, అందరూ కథలుకథలాగా వార్తలు రాస్తున్నారు. షర్మిల తనయుడి పేరు రాజా రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి పేరు రాజా రెడ్డి ధీంతొ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వారసుడు షర్మిల కొడుకు రాజా రెడ్డి ఏ అని ప్రచారం మొదలెట్టేసారు. కాగా ఈ ప్రచారానికి కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు కుమార్తెలే అని చెప్పడంతో మహిళా నెటిజన్ల నుంచి ఎన్నో విమర్శలు వస్తున్నాయి. 


అమ్మాయిలు అయితే రాజకీయ వారసులు కాలేరా ? మహిళలు కేవలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి భార్యగానే ఉండాలా ? ఆంధ్ర ప్రదేశ్ కి ముఖ్యమంత్రి కాలేరా అని విమర్శలు చేస్తున్నారు. మరికొందరు భారత దేశానికే 1966 సమయంలోనే ప్రధాని మంత్రి అయిన దేశం ఇది. అలాంటి దేశంలో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మహిళాలు ముఖ్య మంత్రి అయ్యే యోగం లేదా అని మహిళా నెటిజన్లు ప్రశినిస్తున్నారు. వైఎస్ రాజకీయా వారసులుగా వారి కుమార్తలే ఉండాలి అని మహిళా నెటిజన్లు కోరుకుంటున్నారు. మరి ఈ మహిళా నెటిజన్ల కోరిక తీరుతుందా ? ఈ ప్రశ్నకు ముఖ్యమంత్రి వైఎస్ జగనే సమాధానం చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: