ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వైకాపా ఎమ్మెల్యే , పార్టీకి చెందిన మహిళా కార్యకర్తను లైంగిక వేధించడం , ఆ మహిళా కార్యకర్త తనని వేధిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం , జగన్ వెనువెంటనే స్పందించి సదరు ఎమ్మెల్యేను పిలిపించుకుని క్లాస్ పీకి ... ఇలా మరొకసారి జరిగితే పార్టీ నుంచి బహిష్కరణ తప్పదని హెచ్చరించడం ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారింది .


ప్రకాశం జిల్లాలోని ఒక ఎమ్మెల్యే తనకు అవసరమున్న , లేకున్నా ఓ మహిళా కార్యకర్తను తన ఇంటికి పిలిపించుకుని నీకు పెద్ద పదవి ఇప్పిస్తా , నీ భర్తకు ప్రమోషన్ ఇప్పిస్తా .. నువ్వు మాత్రం నన్ను చూస్కో చాలు , నేను… నిన్ను అన్ని విధాలుగా చూసుకుంటానని గత 15 రోజులుగా ప్రలోభ పెట్టే  లొంగదీసుకుని ప్రయత్నాన్ని చేస్తున్నట్లు తెలుస్తోంది . ఈ విషయాన్ని సదరు మహిళా కార్యకర్త లేఖ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి తెలియజేసిందని సమాచారం  . ఎమ్మెల్యే తనతో ఫోన్ లో అసభ్యంగా మాట్లాడిన మాటలన్నీ రికార్డు చేసి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి చేరవేసిందట సదరు మహిళా కార్యకర్త  .  విషయాన్ని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి వెంటనే ఆ ఎమ్మెల్యేను పిలిపించుకుని గట్టిగానే గడ్డి పెట్టడంతో తానేమి ... సదరు మహిళా కార్యకర్తను వేధించలేదని బుకాయించే ప్రయత్నం చేయగా , జగన్ తనవద్దనున్న సాక్ష్యాధారాలు బయటపెట్టడం తెల్లముఖం వేయడం ఎమ్మెల్యే వంతయిందని తెలుస్తోంది .


తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు , మంత్రులు చేస్తున్న అవినీతిని ఎప్పటికప్పుడు పసిగడుతూ , వారిని హెచ్చరిస్తోన్న జగన్ , ఒక ఎమ్మెల్యే తన పదవిని అడ్డం పెట్టుకుని  మహిళా కార్యకర్తను లైంగికంగా వేధించే ప్రయత్నం చేయగా ఒక  పెద్దన్న మాదిరిగా ముఖ్యమంత్రి స్పందించిన తీరుపై  మహిళలు హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తున్నారు .ఈ విషయం ఆ నోటా , ఈ నోటా బయటపడడం తో ఇంతకూ ఎవరా ఎమ్మెల్యే అన్న చర్చ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది . దీనితో ఎమ్మెల్యేకు ...  ఏమిటా పాడు బుద్ధి అంటూ మహిళలు మండిపడుతున్నారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: