తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఎంత దారుణంగా ఉందో తెలుసు.. జగన్ పార్టీ జోరు ఓవైపు.. పగబట్టిన బీజేపీ ఓవైపు ఆ పార్టీ ఖాతా మూసేయించాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ సమయంలో అసలు పార్టీని కాపాడుకోవడమే సవాలుగా ఉంది.


అయితే చంద్రబాబు మాటలు చూస్తుంటే మాత్రం..ఇంకా పాత తరహాలోనే కోటలు దాటుతున్నాయి. అనంతపురం జిల్లా పర్యటనలో చంద్రబాబు మాట్లాడిన మాటలు ఆసక్తి రేపుతున్నాయి. ధర్మవరంలో కార్యకర్తల నాడి చూడాలని మీటింగ్‌ పెట్టానని.. కానీ కార్యకర్తల ఆదరణతో దాన్ని బహిరంగ సభగా మార్చాల్సి వచ్చిందన్నారు.


ఇంత రాత్రి పూట కూడా వేలాదిగా తరలివచ్చి తనకు మద్దతు పలకడం మరచిపోలేనిదన్నారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృ ష్టిస్తుందని చంద్రబాబు అంటున్నారు. ఇటీవల పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


2009లో సూరిని నియోజకవర్గ ఇన్‌చార్జిగా చేసి 2014లో మీరందరూ ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే... ఇప్పుడు తనకే నీతులు చెప్పి మిమ్మల్ని నట్టేట ముంచి వెళ్లిపోయారని చంద్రబాబు అన్నారు. పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపడం అవసరమే కానీ.. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మాదే అధికారం అనడం మాత్రం కాస్త ఓవర్ గా అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: