ఏపీ సీఎం జగన్.. పరిపాలనలో తనదైన ముద్ర కోసం తపిస్తున్నాడు.. ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకోవాలని ఉందని బహిరంగంగానే చెప్పాడు. తాను ముఖ్యమంత్రి అయ్యాక.. ఆ మార్పును ప్రజలు ఫీల్ అయ్యేలా చేయాలన్నది సీఎం జగన్ లక్ష్యం.


ముందుగా అవినీతిని టార్గెట్ చేసిన జగన్.. సాధ్యమైనంత వరకూ దాన్ని ప్రక్షాళన చేస్తానని చెబుతున్నారు. అవినీతి నిండినపోయిన వ్యవస్థను కడిగేద్దామంటూ జగన్ అధికారులకు పిలుపు ఇస్తున్నారు. ఆ దిశగా వారిని సమాయత్తం చేస్తున్నారు.


ముఖ్యమంత్రిగా తన స్థాయిలో తాను అవినీతిని అ‌డ్డుకుంటానని... అధికారులు వారి వారి స్థాయిల్లో లంచాల వ్యవహారం లేకుండా చూడాలని నేరుగానే చెబుతున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు గట్టిగా తలచుకుంటే ఇది అసాధ్యమేమీ కాదని జగన్ భరోసా ఇస్తున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు.. మండలస్థాయిలో అవినీతి అధికారులను గుర్తించి..వారిని పిలిపించి మాట్లాడాలని జగన్ వీడియో కాన్ఫరెన్సులో సూచించారు.


స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను తప్పుకుండా పరిశీలించి న్యాయం చేయాలన్నారు. అవినీతిని తరిమి కొట్టాలన్న లక్ష్యం చాలా ఉదాత్తమైంది. కానీ సరైన ప్రణాళిక, మెకానిజం ఉంటే తప్ప దాన్ని అరికట్టడం అంత సులభం కాదు. కానీ ప్రయత్నమంటూ జరగాలి కదా. జగన్ ప్రయత్నాన్ని అభినందిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: