కెసిఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత దూకుడు పెంచారు.  అయితే, పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఆ దూకుడు కొంతవరకు తగ్గింది.  దానికి కారణం ఉంది.  ఆ ఎన్నికల్లో అనుకున్న స్థానాలు గెలుచుకోలేకపోవడంతో సెంటిమెంట్ తగ్గిపోతుందని గమనించారు.  


అందుకే పాలనా పరంగా మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారు.  ఇందులో భాగంగానే.. కెసిఆర్ పలు పధకాలు ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఇందులో కీలకమైన పధకం అందరికి ఆరోగ్యం.  దీనిద్వారా ప్రజలంతా లబ్దిపొందేలా చేయాలని కెసిఆర్ ఆలోచన.  


ప్రజలు లభ్ది పొందే విధంగా చేయడానికి ఆలోచనలు మొదలయ్యాయి.  ఇప్పటికే ఆరోగ్యశ్రీ ద్వారా చాలామంది ప్రజలు లబ్ది పొందుతున్నారు.  ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి కార్మికులకు వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.  అదే విధంగా తెలంగాణాలో ఉండే ప్రజలందరికి వైద్యం అందేలా చూసేందుకు కెసిఆర్ రెడీ అవుతున్నారు.  


ఇప్పటికే తెలంగాణ ప్రజలకు ఉన్న జబ్బుల విషయాలకు సంబంధించిన డాటాను కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.   ఈ డాటా ద్వారా ఎవరెవరికి ఎలాంటి జబ్బులున్నాయో తెలుసుకొని వారికి వైద్యం చేయించడం ద్వారా అందరికి ఆరోగ్యంను అమలు చేయాలనీ అనుకుంటున్నారట.  ఈ పధకం అమలైతే... సూపర్బ్ కదా.  తప్పకుండా కెసిఆర్ కు మంచి పేరు వస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: